Jagadish Shettar: బజరంగ్ దల్ నిషేధ ప్రతిపాదన చర్చనీయాంశమే కాదు..!
ABN, First Publish Date - 2023-05-10T16:40:37+05:30
బెంగళూరు: కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పై నిషేధ ప్రతిపాదనపై ఆ పార్టీ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ సూటి సమాధానమిచ్చారు. అది మరీ అంత చర్చనీయాంశమేమీ కాదని అన్నారు. ఏ సంస్థను నిషేధించాలన్నా అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం ప్రకారం ఉంటుందని, నిషేధించేది రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్పారు.
బెంగళూరు: కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ (Bajrang Dal)పై నిషేధ ప్రతిపాదనపై ఆ పార్టీ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ (Jagadish Shettar) సూటి సమాధానమిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారంనాడు ఓవైపు జరుగుతుండగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అది మరీ అంత చర్చనీయాంశమేమీ కాదని అన్నారు. ఏ సంస్థను నిషేధించాలన్నా అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం ప్రకారం ఉంటుందని, నిషేధించేది రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం మేరకే సంస్థలపై నిషేధం ఉంటుందని, రాష్ట్రాలకు ఆ అధికారం ఉండదనే విషయం గతంలో తాను చాలా సార్లు చెప్పినట్టు షెట్టర్ తెలిపారు. బీజేపీ మాజీ సీఎంగా ఉన్న ఆయనకు ఆ పార్టీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. హుబ్లి-దార్వాడ్-సెంట్రల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి 2012 జూలై 12 నుంచి 2013 మే 13 వరకూ 305 రోజుల పాటు ఆయన కర్ణాటక 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టోలో శాంతి విఘాతం కలిగిస్తే బజరంగ్ దల్‌పై నిషేధానికి వెనుకాడమని తెలిపింది. దీంతో ఈ అంశాన్ని బీజేపీ ప్రచారాస్ట్రంగా మలుచుకునే ప్రయత్నం చేసింది.
Updated Date - 2023-05-10T17:26:02+05:30 IST