Jammu and Kashmir : కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
ABN, First Publish Date - 2023-06-13T15:08:51+05:30
భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో మరో విజయం సాధించాయి. నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా, డొబనార్ మషల్ ప్రాంతంలో వీరిని మట్టుబెట్టినట్లు కశ్మీరు పోలీసులు ప్రకటించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
న్యూఢిల్లీ : భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో మరో విజయం సాధించాయి. నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా, డొబనార్ మషల్ ప్రాంతంలో వీరిని మట్టుబెట్టినట్లు కశ్మీరు పోలీసులు ప్రకటించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కశ్మీరు పోలీసులు ట్విటర్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం, జమ్మూ-కశ్మీరులోని కుప్వారాలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కార్యకలాపాల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. డొబనార్ మషల్ ప్రాంతంలో మంగళవారం ఈ సంఘటన జరిగినట్లు కశ్మీరు పోలీసులు ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కోసం సోదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా, జీ20 సమావేశాల్లో భాగంగా పర్యాటక రంగంపై సమావేశాలు మే నెలలో మూడు రోజులపాటు శ్రీనగర్‌లో జరిగాయి. చైనా మినహా ఇతర దేశాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో వీరికి భారతీయ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వివిధ దేశాల ప్రతినిధులు చరిత్రాత్మక పోలో వ్యూ మార్కెట్, మొఘల్ గార్డెన్, పారి మహల్ వంటివాటిని సందర్శించి, అద్భుత అనుభూతికి లోనయ్యారు. ఉగ్రవాదుల వల్ల ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఈ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి.
ఇవి కూడా చదవండి :
AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?
Govt Vs Twitter : ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపణలు పూర్తిగా అబద్ధం : కేంద్ర మంత్రి
Updated Date - 2023-06-13T15:08:51+05:30 IST