ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress Vs JDS : కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై కుమార స్వామి ‘రేట్ కార్డ్’

ABN, First Publish Date - 2023-07-13T15:07:46+05:30

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల బదిలీల కోసం వేర్వేరు రేట్లను నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని చెప్పారు.

HD Kumaraswamy, Siddaramaiah,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల బదిలీల కోసం వేర్వేరు రేట్లను నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని చెప్పారు. ఈ వివరాలను తెలిపే ఓ రేట్ కార్డును కూడా ఆయన గురువారం శాసన సభలో విడుదల చేశారు. అయితే ఏ శాఖలో, ఏ మంత్రి ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆయన వివరించలేదు.

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచార సమయంలో పత్రికా ప్రకటనలు జారీ చేస్తూ ఉండేదని, దానిలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతి గురించి చెప్తూ ఉండేదని కుమార స్వామి తెలిపారు. బీజేపీ అవినీతికి పాల్పడిందని, రూ.1.5 లక్షల కోట్లు దోచుకుందని ఈ ప్రకటనల్లో చెప్తూ ఉండేదన్నారు. అధికారుల బదిలీల కోసం ఓ డిపార్ట్‌మెంట్‌లో నిర్ణయించిన రేట్ల వివరాలు తనకు లభించాయని, ఈ సొమ్మును ఆ శాఖ మంత్రికి పంపిస్తున్నారని చెప్పారు. తాను ఈ వివరాలను శాసన సభ సభాపతికి, ముఖ్యమంత్రికి పంపిస్తానన్నారు. తాను ఆ మంత్రిని నిందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని మాత్రమే బయటపెడుతున్నానని చెప్పారు. ‘‘మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించగలరా? నేను చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపిస్తాను’’ అని చెప్పారు.

అది వ్యవసాయ శాఖేనా?

కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామి మాట్లాడుతూ, ఈ రేట్ కార్డును విడుదల చేసినందుకు కుమార స్వామిని అభినందించారు. కుమార స్వామి తనను, కాంగ్రెస్‌ను, వొక్కళిగ ప్రజలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి :

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు

Updated Date - 2023-07-13T15:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising