ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

JP Nadda: గెహ్లాట్ ప్రభుత్వంలో ప్రతిరోజూ 5 నుంచి 7 హత్యలు

ABN, First Publish Date - 2023-07-16T16:43:11+05:30

రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 5 నుంచి 7 వరకూ హత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు అశోక్‌గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇంకెతమాత్రం ప్రజలు సహించే పరిస్థితి లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 5 నుంచి 7 వరకూ హత్యలు చోటుచేసుకుంటున్నాయంటూ అశోక్‌గెహ్లాట్ (Ashok Gehlot) ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇంకెతమాత్రం ప్రజలు సహించే పరిస్థితి లేదన్నారు. జైపూర్‌లో బీజేపీ చేపట్టిన 'నహీ సహేగా రాజస్థాన్' ప్రచార కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో, గెహ్లాట్ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఉదయ్‌పూర్‌లో కన్హ్యయ లాల్ హత్య, మతకల్లోలాలు, ఇతర అంశాలపై కూడిన ఒక వీడియోను ఆయన విడుదల చేశారు.


''మేము (బీజేపీ) సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి పనులను కోసం పనిచేస్తున్నాం. అయితే మేము చేపట్టిన అభివృద్ధి పనులకు గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత, దౌర్యన్యాలు, ఆశ్రితపక్షపాతం, అవినీతి అవరోధంగా ఉన్నాయి. రాజస్థాన్‌లో రికార్డు స్థాయిలో 24 వేల మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఇక్కడికి సమీపంలోనే అత్యాచార బాధితురాలైన ఓ మహిళ ఆత్మహత్మకు పాల్పడిన కేసు కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. సంస్కృతి, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన రాజస్థాన్‌లో ఈరోజు మహిళల అణచివేత పరాకాష్టకు చేరుకుంది. అలాంటి వ్యక్తులు సరైన సమాధానం చెప్పే బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉంది. గెహ్లాట్ ప్రభుత్వా్న్ని ప్రజలు ఇంకెంతమాత్రం సహించే పరిస్థితిలో లేరు'' అని నడ్డా అన్నారు.

Updated Date - 2023-07-16T16:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising