ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kamal Nath: మీరొక డమ్మీ ముఖ్యమంత్రి, అందుకే మోదీ పక్కనపెట్టేశారు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కమల్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు

ABN, First Publish Date - 2023-09-25T16:55:57+05:30

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ నిప్పులు చెరిగారు. ఆయనో డమ్మీ ముఖ్యమంత్రి అని, పచ్చి అబద్ధాల కోరు అంటూ ధ్వజమెత్తారు. అందుకే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో...

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ నిప్పులు చెరిగారు. ఆయనో డమ్మీ ముఖ్యమంత్రి అని, పచ్చి అబద్ధాల కోరు అంటూ ధ్వజమెత్తారు. అందుకే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆయన్ను ప్రధాని మోదీ పూర్తిగా పక్కనపెట్టేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని మోదీ వచ్చినప్పుడల్లా.. ఆయనకు అబద్ధాలు చెప్తూ విసుగు తెప్పించేశారని అన్నారు. నోటికొచ్చిన అబద్దాలు చెప్తున్నారన్న విషయం మోదీకి అర్థమైందని.. అందుకే శివరాజ్ ఒక డమ్మీ సీఎం అని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉనికి పెద్దగా కనిపించడం లేదు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే తారాస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. జన ఆశీర్వాద యాత్ర విషయంలోనూ ప్రధాని హవానే ఉంది తప్ప శివరాజ్ ఉనికి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే.. శివరాజ్ అబద్ధాల చిట్టాను ట్విటర్ మాధ్యమంగా కమిల్ నాథ్ షేర్ చేశారు. శివరాజ్ అబద్ధాల యంత్రం.. ప్రధానిని, మధ్యప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పెట్టిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగిందని రేవాలో ప్రధాని మోదీకి శివరాజ్ చెప్పారని.. కానీ మధ్యప్రదేశ్ రైతుల ఆదాయం తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక చూపించిందని పోస్ట్ పెట్టారు.


అంతేకాదు.. మధ్యప్రదేశ్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100 కంటే తక్కువగా ఉందని ప్రధానికి శివరాజ్ తప్పుడు పత్రాన్ని అందజేశారన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలపై కూడా సీఎం అబద్ధాలు చెప్తున్నారని ఆరోపణలు చేశారు. సాగర్ జిల్లాను ప్రధాని సందర్శించినప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌ను పట్టించుకోలేదని శివరాజ్ చెప్పారన్నారు. అయితే.. యూపీఏ ప్రభుత్వం రూ.7,200 కోట్ల ప్రత్యేక బుందేల్‌ఖండ్ ప్యాకేజీని ఇచ్చిందని కమల్‌నాథ్ గుర్తు చేశారు. ఇలా శివరాజ్ సింగ్ అబద్ధాలు చెప్పడం వల్లే.. ఎన్నికల నుంచి ఆయన్ను ప్రధాని మోదీ మినహాయించారని, మీరో ముఖ్యమంత్రే కానీ డమ్మీ సీఎం అని సెటైర్లు వేశారు.

ఇదిలావుండగా.. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ సీఎం పదవి అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీఎం సీటులో ఉన్న శివరాజ్ సింగ్ చౌహానే అత్యున్నత హోదాలో కొనసాగుతారా? అని మీడియా ప్రశ్నించినప్పుడు.. ఎన్నికల తర్వాతే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని అమిత్ షా కుండబద్దలు కొట్టారు. చూస్తుంటే.. ఈసారి ఆయన్ను సీఎంగా కాకుండా ఇతరులకు ఆ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-09-25T16:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising