ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnaraka CM decision: ఎందుకీ జాప్యం? రాజకీయాలు ఆపండి.. బొమ్మై విసుర్లు

ABN, First Publish Date - 2023-05-17T21:20:50+05:30

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుటికీ ముఖ్యమంత్రి ఎంపికలో చేస్తున్న జాప్యాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై నిలదీశారు. ఆ పార్టీలో ఐక్యత లోపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాని ప్రజాసేవకు నడుం బిగించాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుటికీ ముఖ్యమంత్రి ఎంపికలో చేస్తున్న జాప్యాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) నిలదీశారు. ఆ పార్టీలో ఐక్యత లోపించడం వల్లే సీఎం ఎంపికలో జాప్యం జరుగుతోందని బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాని ప్రజాసేవకు నడుం బిగించాలని సూచించారు.

కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారని, రాష్ట్రాభివృద్ధికి వెంటనే పనిచేయాలని మాజీ సీఎం అన్నారు. పూర్తి మెజారిటీ సాధించినా ఆ పార్టీలో ఐక్యత లోపించడం వల్లనే సీఎం ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం మాని, కొత్త సీఎంను ఎన్నుకుని, ప్రజలకు సేవ చేసేందుకు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. సీఎం ఎంపిక ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైనందున ఇంతకంటే తాను ఎక్కువ మాట్లడలేనని అన్నారు. రాష్ట్రంలోని లింగాయత్ సామాజిక వర్గం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, లింగాయత్‌ల గురించి కాంగ్రెస్ మాటల్లో చాలా చెప్పిందని, సీఎం, డిప్యూటీ సీఎంతో సహా ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఎన్ని పదవులు ఇస్తుందో తాము వేచిచూడాలని అనుకుంటున్నామని చెప్పారు.

Updated Date - 2023-05-17T21:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising