Karnataka Elections: 224 నియోజకవర్గాలు 5,102 నామినేషన్లు
ABN, First Publish Date - 2023-04-21T09:05:19+05:30
శాసనసభ ఎన్నికలకుగానూ నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజున భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో నామినేషన్లఘట్టం ముగిసింది. 224 నియోజకవర్గాలకుగాను 3,632 మంది అభ్యర్థులు 5,102 నామినేషన్లు దాఖలు చేశారు. గడిచిన ఎన్నికలతో పోలిస్తే రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. గురువారంతో నామినేషన్లు ముగిశాయి. చివరిరోజు 1619 మంది 1934 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 1544మంది పురుషులు 1771 నామినేషన్లు వేశారు. 146మంది మహిళలు 162 నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులు ఒక నామినేషన్ దాఖలు చేశారు. 224 నియోజకవర్గాలకు 3,632 మంది 5102 నామినేషన్లు వేశారు. వీరిలో 3327మంది పురుషులు 4710 నామినేషన్లు దాఖలు చేశారు. 304మంది మహిళలు 391 నామినేష న్లు వేశారు. అత్యధికంగా బీజేపీ తరపున 707 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరపున 651మంది, జేడీఎస్ తరపున 455, ఆప్ 373, బీఎస్పీ 179, ఎన్‌పీపీ 5మంది, సీపీఎం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. రిజిస్టర్ అయి ప్రాధాన్యత రాజకీయ పార్టీల నుంచి 1007మంది నామినేషన్లు వేయగా, స్వతంత్రులుగా 1720 మంది వేశారు. మొత్తం 5102 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చు.
Updated Date - 2023-04-21T12:13:38+05:30 IST