Karnataka: ఉగ్యోగాలు ఇస్తాం..సమస్యను పరిష్కరిస్తాం: డీకే
ABN, First Publish Date - 2023-05-28T18:25:59+05:30
కర్ణాటకలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. బెంగళూరులోని డీకే నివాసం వద్ద 1,500 మందికి పైగా నిరుద్యోగులు ఆయనను కలుసుకున్నారు. తొలుత కర్ణాటక పవర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో నియామక ప్రక్రియను ప్రారంభించాలని వారు డీకేను కోరారు.
బెంగళూరు: కర్ణాటకలో నిరుద్యోగ సమస్య (Employment problem) పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) హామీ ఇచ్చారు. బెంగళూరులోని డీకే నివాసం వద్ద 1,500 మందికి పైగా నిరుద్యోగులు ఆయనను కలుసుకున్నారు. తొలుత కర్ణాటక పవర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో నియామక ప్రక్రియను ప్రారంభించాలని వారు డీకేను కోరారు.
''ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని మేము వాగ్దానం చేశాం. దానిని అమలు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది. అర్హులైన వారిని గుర్తించి, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. ఖాళీలు భర్తీ చేస్తాం. అయితే ఒకటి, రెండు రోజుల్లోనే ఇది పూర్తవుతుందని చెప్పలేను. తప్పనిసరిగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం'' అని డీకే తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలు ఇచ్చింది. వాటిలో 'యువనిధి' పథకం కూడా ఒకటి. ఈ పథకం 18 నుంచి 25 ఏళ్ల లోపు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3,000, డిప్లమో హోల్డర్లకు రూ.1,500 చొప్పున భృతి కల్పిస్తారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీల అమలుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2023-05-28T18:31:55+05:30 IST