ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddaramaiah: కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య తెలుసుగా.. ఇప్పుడు ముచ్చట ఏంటంటే..

ABN, First Publish Date - 2023-04-15T18:03:19+05:30

ప్రతిపక్షనేత సిద్దరామయ్య వరుణ నుంచి ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు. దీంతో సిద్దరామయ్య అనుచరులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్య వరుణ (Siddaramaiah Varuna) నుంచి ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు. దీంతో సిద్దరామయ్య అనుచరులు, స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరుణ నియోజకవర్గం సిద్దరామయ్యకు (Varuna Assembly Constituency) ఖరారైనప్పటి నుంచే నియోజకవర్గంలో ఉత్సాహం నెలకొంది. మైసూరు జిల్లాకు చెందిన పార్టీ వర్గాలు వరుణలో పనిచేసేందుకు సిద్ధమయ్యాయి.

వరుణ సిట్టింగ్‌ ఎమ్మెల్యే యతీంద్ర సిద్దరామయ్య స్థానికంగానే ఉంటూ ఏర్పాట్లు చూస్తున్నారు. కానీ సిద్దరామయ్య కోలారు నుంచి పోటీ చేసేందుకు ప్రారంభం నుంచే ఆసక్తి చూపారు. పలుమార్లు కోలారు (Kolar) నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు అక్కడే పోటీ చేయాలని భావించిన తరుణంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ వేళ అగ్రనేత రాహుల్‌గాంధీ కోలారుకు వెళ్లరాదని సూచించారు.

ఇది కూడా చదవండి: Bangalore: మంత్రి అఫిడవిట్‌లో మతిపోయే వివరాలు.. భర్తకు, మామకు అప్పులిచ్చిన మంత్రి గారి భార్య..!

తొలి జాబితాలోనే వరుణ నియోజకవర్గానికి టికెట్‌ ఖరారు చేశారు. చివరి క్షణం దాకా సిద్దరామయ్య వరుణతోపాటు కోలారు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. తాజాగా శుక్రవారం స్వయంగా రాహుల్‌గాంధీ, సిద్దరామయ్యతో ప్రత్యేకంగా మాట్లాడి కోలారు టికెట్‌ ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. నిరాశ వద్దని వరుణ అనుకూలంగా ఉందని సూచించినట్టు సమాచారం. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం తప్పుడు సందేశం వెళ్తుందని అధిష్టానానికి చెందిన కొందరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీంతో సిద్దరామయ్య కేవలం వరుణ నుంచి మాత్రమే పోటీ చేయనున్నారు.

తాజాగా.. కర్ణాటక కాంగ్రెస్ శనివారం నాడు విడుదల చేసిన మూడో విడత అభ్యర్థుల జాబితాతో ఈ విషయం స్పష్టమైంది. 43 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను మూడో విడత జాబితాలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో కోలారు నుంచి కొత్తూర్ జి.మంజునాథ్‌ను అభ్యర్థిగా నిలుపుతున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీంతో.. కోలారు నుంచి పోటీ చేయాలని భావించిన సిద్ధరామయ్య కోరిక కలగానే మిగిలిపోయింది. ఇదిలా ఉండగా.. కర్ణాటక కాంగ్రెస్ ఈ మూడో జాబితాతో కలిపి మొత్తం 209 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మరో 15 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ప్రకటిస్తే కర్ణాటకలో మొత్తం ఉన్న 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టు అవుతుంది.

Updated Date - 2023-04-15T18:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising