Karnataka: పేద కుటుంబాలకు నెలకు రూ.2వేల సాయం...బీజేపీ సర్కార్ ఎన్నికల తాయిలం
ABN, First Publish Date - 2023-01-19T11:08:41+05:30
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఎన్నికల తాయిలం...
బెంగళూరు(కర్ణాటక): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఎన్నికల తాయిలం ప్రకటించింది.(Karnataka govt) దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్)(BPL family) కుటుంబానికి నెలకు రెండువేల రూపాయల సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక(Karnataka revenue minister Ashoka) వెల్లడించారు. రాబోయే బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తాము మహిళలకు నెలకు రెండువేల రూపాయలు ఇస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తాజా ప్రకటన చేశారు.ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ సాయం పథకంపై మరింత సమాచారం ఇస్తారని మంత్రి తెలిపారు. గత 75 ఏళ్లుగా చేయని పనిని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిందని కర్ణాటక రెవెన్యూ మంత్రి పేర్కొన్నారు.
Updated Date - 2023-01-19T11:08:44+05:30 IST