Karunanidhi: దివంగత మాజీ సీఎం పేరుతో కొత్త పాఠ్యాంశాలు
ABN, First Publish Date - 2023-06-21T13:01:09+05:30
వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) పేరుతో కొత్త పాఠ్యాంశాలు
ఐసిఎఫ్(చెన్నై): వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) పేరుతో కొత్త పాఠ్యాంశాలు చేర్చనున్నట్లు రాష్ట్ర పాఠ్య గ్రంథ సంస్థ అధ్యక్షుడు దిండుగల్ లియోనీ తెలిపారు. నాగపట్టణంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు అందజేయడానికి 5.16 కోట్ల పుస్తకాలు ముద్రించగా, వాటిలో 80 శాతం పాఠశాల ప్రారంభం రోజునే అందజేశామని తెలిపారు. సీబీఎ్‌సఈ, మెట్రిక్ పాఠశాలల్లో నిర్బంధ తమిళం ప్రవేశపెట్టడంతో 10 శాతం అదనంగా తమిళ పాఠ్యపుస్తకాలు ముద్రించామని తెలిపారు. వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాల్లో ‘సెమ్మొళి నాయగన్ కలైంజర్’ లేదా ‘తమిళగత్తిన్ శిర్పి కలైంజర్’ అనే పేరుతో కొత్త పాఠ్యాంశాలను చేర్చనున్నామని తెలిపారు.
Updated Date - 2023-06-21T13:01:10+05:30 IST