ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uttarakhand: భారీ వర్షాలతో కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

ABN, First Publish Date - 2023-06-25T16:23:39+05:30

ఉత్తరాఖండ్‌ లో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో కేదార్‌నాథ్‌ యాత్ర (Kedarnath Yatra)ను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.

కాగా, రుద్రప్రయోజ్ జిల్లాతో పాటు పలు జిల్లాలో భారీగా వర్షాపాతం నమోదైంది. హరిద్వార్‌లో గత 24 గంటల్లో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, డెహ్రాడూన్‌లో 33.2, ఉత్తరకాశిలో 27.7 మిల్లీమీటర్ల వర్షపాతత నమోదైనట్టు భారత వాతావారణ శాఖ తెలియజేసింది. పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండటం, మరిన్ని వర్షాలకు అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి ఆదేశాలిచ్చారు.

సీఎం సమీక్ష

రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెక్రటేరియట్‌లోని స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ కంట్రోల్ రూమ్‌ను ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. హరిద్వార్‌లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఏరియాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని, సెన్సిటివ్ ప్రాంతాల్లో జేసీబీ మిషన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నదులు, డ్రెయిన్ల సమీపంలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా చేయాలని సూచించారు. ఛార్‌థామ్‌లలో ఉన్న యాత్రికుల సంఖ్య, భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రుతుపవనాల కారణంగా రాబోయే ఐదారు రోజుల్లో భారీగా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అప్రమత్తం చేసిందని, ఈ నేపథ్యంలో అధికారులతో తాను సమావేశమయ్యానని తెలిపారు. పరస్పరం సమన్యయంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఒకవేళ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే వస్తే తగినన్ని నైట్ షెల్టర్లు, సహాయ సామగ్రి ప్రతి జిల్లాల్లో అందుబాటులో ఉండేలా తగిన ఆదేశాలిచ్చామని చెప్పారు.

Updated Date - 2023-06-25T16:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising