Kejriwal Bungalow Row: ఫైళ్లు పంపమని ఆదేశించిన ఎల్జీ

ABN, First Publish Date - 2023-04-29T13:49:46+05:30

ఢిల్లీ సివిల్ లైన్స్ ఏరియాలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భవంతి వివాదంలో కీలక పరిమాణం..

Kejriwal Bungalow Row: ఫైళ్లు పంపమని ఆదేశించిన ఎల్జీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ సివిల్ లైన్స్ ఏరియాలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భవంతి వివాదంలో (Bangalow Row) కీలక పరిమాణం చోటుచేసుకుంది. సీఎం నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మీడియాలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (VK Saxena) ఇందుకు సంబంధించిన ఫైళ్లను తన పరిశీలనకు పంపాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి నివాసం పునర్మిర్మాణం (Renovation) కోసం ఆప్, ఢిల్లీ సీఎం రూ.45 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇందులో ముమ్మాటికీ అవినీతి చోటుచేసుకుందని బీజేపీ ఆరోపించింది. రూ.10 కోట్లు ఖర్చు దాటితే లెఫ్టినెంట్ గవర్నర్ స్క్రూటినీ పరిధిలోకి వస్తుందని, ఆయన పరిధిలోకి రాకుండా చూసేందుకు తక్కువ ఖర్చు చూపించారని బీజేపీ ఆరోపించింది.

''ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఖర్చు రూ.9.99 కోట్లు. ఇంత కచ్చితంగా ఎలా లెక్కలు వేశారు? ఇది తెలివిగా మదింపు చేసిన లెక్కగానే చెప్పాలి. దీనిని బట్టి చాలా స్పష్టంగా అవినీతి జరిగినట్టు తేలుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని ఇది బహిర్గతం చేస్తోంది'' అని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాన్షు త్రివేది ఆరోపించారు. కరోనా సమయంలో అన్ని నిర్మాణాలు, పరిశ్రమల ఉత్పత్తి నిలిచిపోయాయని, రాష్ట్ర ఆదాయం సైతం సగానికంటే తగ్గిపోయిందని, ప్రజలు కడగండ్లు పడుతున్న సమయంలో కోట్లాది రూపాయలతో నిర్మాణం జరపడం ఏమిటని బీజేపీ నిలదీసింది.అయితే ఈ ఆరోపణలను ఆప్ కొట్టివేసింది. బీజేపీ అనేక ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం నివాసానికి రూ.45 కోట్లు ఖర్చు చేశారంటూ యాగీ చేస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. పుల్వామా దాడి, అదానీ వివాదం వంటి అంశాలపై సీఎం నివాసంలో చర్చ జరక్కుండా చేసేందుకు బీజేపీ ఈ ప్రయత్నాలకు దిగిందని మండిపడింది. 1942లో కట్టిన 80 ఏళ్ల క్రితం నాటి భవనం ఇదని, ఒక్కసారి కాదు..మూడు సార్లు పైకప్పు కూలిపోయిన ఘటనలు ఇంతకుముందు చోటుచేసుకున్నాయని సంజయ్ సింగ్ వివరించారు.

Updated Date - 2023-04-29T13:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising