ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ కీలక అనుచరుడి అరెస్ట్

ABN, First Publish Date - 2023-04-15T17:59:06+05:30

ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ డే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Waris De Punjab chief Amritpal Singh) ముఖ్య అనుచరుడు జోగా సింగ్

Amrit Pal Singh, Punjab
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చండీగఢ్ : ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ డే పంజాబ్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Waris De Punjab chief Amritpal Singh) ముఖ్య అనుచరుడు జోగా సింగ్ (Joga Singh)ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ అమృత్‌సర్, హోషియార్‌పూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన కార్యకలాపాల్లో ఆయనను అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్, జోగా మార్చి 18 నుంచి 28 వరకు కలిసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బోర్డర్ రేంజ్ డీఐజీ నరీందర్ భార్గవ్ (Narinder Bhargav) శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, అమృత్‌పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు జోగా సింగ్‌ను సిర్హింద్‌లో అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మార్చి 18 నుంచి 28 వరకు కలిసి ఉన్నారు. గ్రామీణ అమృత్‌సర్, హోషియార్‌పూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన కార్యకలాపాల్లో ఆయనను అరెస్ట్ చేశారు.

వారిస్ డే పంజాబ్ కార్యకర్తలపై పంజాబ్ పోలీసులు గత నెలలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. మార్చి 18న అమృత్‌పాల్ సింగ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి అతనిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఆయన తన రూపాన్ని తరచూ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు హోషియార్‌పూర్ జిల్లా, బబక్ గ్రామవాసి రాజ్‌దీప్ సింగ్ కాగా, మరొకరు జలంధర్ జిల్లాకు చెందిన సర్బజిత్ సింగ్ అని పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ శుక్రవారం రాత్రి డ్యూటీ మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరిచారు. వీరిద్దరికీ ఒక రోజు పోలీస్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి :

Delhi Excise Policy: కోర్టుల ముందు అబద్దాలు చెబుతున్న దర్యాప్తు సంస్థలు.. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్

Kejriwal Vs Rijiju : కేజ్రీవాల్‌‌కు కేంద్ర మంత్రి రిజిజు సూటి ప్రశ్న

Updated Date - 2023-04-15T17:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising