ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khalistan : మా లక్ష్యం చెడ్డది కాదు : అమృత్ పాల్ సింగ్

ABN, First Publish Date - 2023-02-24T15:03:43+05:30

కిడ్నాప్ కేసులో అరెస్టయిన లవ్‌ప్రీత్ సింగ్ వురపు తూఫాన్‌ (Lovepreet Singh alias Toofan)ను విడుదల చేయాలంటూ అమృత్‌పాల్ సింగ్

Amritpal Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్ : ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని తాము కోరుకుంటున్నామని, ఈ లక్ష్యం చెడ్డది కాదని వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) చెప్పారు. తమ లక్ష్యాన్ని మేధోపరంగా చూడాలన్నారు. దీనివల్ల కలిగే భౌగోళిక రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడాలని తెలిపారు. ఇది ఓ సిద్ధాంతమని, సిద్ధాంతం ఎప్పుడూ చావదని చెప్పారు. ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) దీనిని ఇవ్వాలని తాము కోరుకోవడం లేదన్నారు.

కిడ్నాప్ కేసులో అరెస్టయిన లవ్‌ప్రీత్ సింగ్ వురపు తూఫాన్‌ (Lovepreet Singh alias Toofan)ను విడుదల చేయాలంటూ అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు గురువారం అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన సంగతి తెలిసిందే. వీరంతా తుపాకులు, కత్తులను తిప్పుతూ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అమృత్‌పాల్ ఖలిస్థాన్ సానుభూతిపరుడు

ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, అరెస్టయిన వ్యక్తిని (తూఫాన్‌ను) శుక్రవారం సాయంత్రానికి విడుదల చేస్తారని భావిస్తున్నామన్నారు. న్యాయపరమైన కొన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత విడుదల చేస్తామన్నారని తెలిపారు. తూఫాన్ విడుదలైన తర్వాత స్వర్ణ దేవాలయంలో పూజలు చేస్తారని తెలిపారు.

గ్రామీణ అమృత్‌సర్ (Amritsar) పోలీసు సూపరింటెండెంట్ సతీందర్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ, కిడ్నాప్ జరిగిన ప్రదేశంలో లవ్‌ప్రీత్ సింగ్ లేనట్లు సాక్ష్యాధారాలను అమృత్‌పాల్ పక్షం చూపించిందని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పిస్తామన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. గురువారం జరిగిన హింసాకాండపై కేసు నమోదైందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి :

Meghalaya : బీఫ్ తినే అలవాటుపై మేఘాలయ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Maharashtra : 512 కేజీల ఉల్లిపాయలు... 70 కి.మీ. ప్రయాణం... ఆ రైతుకు వచ్చిన లాభాలు వింటే అవాక్కవుతారు...

Updated Date - 2023-02-24T15:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising