Khushboo: వెనక్కి తగ్గారు.. ఖుష్బూ ట్వీట్.. ఆనక తొలగింపు.. అసలు విషయమేంటంటే..
ABN, First Publish Date - 2023-07-26T08:41:06+05:30
అన్ని న్యాయస్థానాల్లో కేవలం మహాత్మా గాంధీ, తిరువళ్ళువర్ చిత్రపటాలను మాత్రమే ఉంచాలంటూ మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన స
అడయార్(చెన్నై): అన్ని న్యాయస్థానాల్లో కేవలం మహాత్మా గాంధీ, తిరువళ్ళువర్ చిత్రపటాలను మాత్రమే ఉంచాలంటూ మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన సర్క్యులర్‌పై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కితగ్గారు. దీనిపై సినీ నటి, బీజేపీ మహిళా నేత, జాతీయ మహిళా సంఘ సభ్యురాలు ఖుష్బూ(Khushboo) స్పందిస్తూ... ఇది డీఎంకే సర్కారు అహంకారానికి నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని ఉంచడం వల్ల ఎలాంటి నష్టం వస్తుందని ప్రశ్నించారు. న్యాయస్థానాలను ఒక రాజకీయ పార్టీ తప్పుపట్టడం ఏ మేరకు సబబు అని ఆమె ప్రశ్నిస్తూ ఆమె ట్వీట్ చేశారు. అయితే, కొంతసేపటి తర్వాత ఆమె ఆ ట్వీట్‌ను తొలగించారు.
Updated Date - 2023-07-26T08:41:06+05:30 IST