HD Kumara Swamy: రాజకీయ ఊసరవెల్లి, గోబెల్స్ మరో అవతారం అమిత్‌షా

ABN, First Publish Date - 2023-01-01T16:23:32+05:30

భారతీయ జనతా పార్టీ , కేంద్ర మంత్రి అమిత్‌షాపై జనతాదళ్ (సెక్యులర్) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి తీవ్రస్థాయిలో..

HD Kumara Swamy: రాజకీయ ఊసరవెల్లి, గోబెల్స్ మరో అవతారం అమిత్‌షా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ (Bjp), కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) పై జనతాదళ్ (సెక్యులర్) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి (HD Kumaraswamy) తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. అమిత్‌షా రాజకీయ ఊసరవెళ్లి అని, జోసెఫ్ గోబెల్స్ (Joseph Goebbels) మళ్లీ అమిత్‌షాగా పుట్టారని అన్నారు. నయవంచనలు, అబద్ధాలతో నిండిన పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు.

''అమిత్‌షా...మీరు రాజకీయ ఊసరవెల్లి. మీ పార్టీ నిజస్వరూపం ఇది. జోసెష్ గోబెల్స్ మళ్లీ మీలా పుట్టారు. మీకు ఏమాత్రం జౌచిత్యం లేదు'' అని కుమారస్వామి ట్వీట్ చేశారు. జేడీ(ఎస్) కుటుంబ పార్టీ అని, అవినీతిమయమని కర్ణాటకలో జరిగిన ఓ ర్యాలీలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తాము గెలిస్తే జేడీఎస్ ఏటీఎం అని ఆయన ఆరోపిస్తుంటారని, కర్ణాటక ఏమైనా బీజేపీ ఏటీఎం అని మీరు అనుకుంటున్నారా? అని నిలదీశారు. కుటుంబ రాజకీయాలు మీ (బీజేపీ) పార్టీలో లేవా అని ప్రశ్నించారు. ''మీ కుమారుడు క్రికెట్ పండిట్? బీసీసీఐలో ఆయన భాగం కాదా? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను లోబడి మీ కుమారుడి ఎంపిక జరిగిందా? బీసీసీకి ఏటీఎం ఎవరో ఇప్పుడు చెప్పండి?'' అని మరో ట్వీట్‌లో కుమారస్వామి నిలదీశారు.

బీజేపీ కౌంటర్..

కాగా, కుమారస్వామి వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాజ్ పూనావాలా తిప్పికొట్టారు. కుమారస్వామి రాజకీయంగా నిరాశానిస్పృహలతో ఉన్నారని అన్నారు. ఆయన పార్టీ రోజురోజుకూ, ప్రతి ఎన్నికకూ క్షీణించిపోతోందన్నారు. మాజీ సీఎంగా ఆయన వాడుతున్న భాష ఏమాత్రం బాగోలేదని చెప్పారు. జేడీఎస్‌కు ఓటు వేస్తే అది వృథా అవుతుందని, ఎందుకంటే వాళ్లు కాంగ్రెస్‌తో మిలాఖత్ అవుతారని అన్నారు. కాంగ్రెస్ సబ్‌వేరియంట్ జేడీఎస్ అని ఆయన ఎదురుదాడి చేశారు. కాగా, కర్ణాటకలో జేడీఎస్‌తో ఎలాంటి పొత్తూ లేకుండా ఒంటరిగానే ఎన్నికలలో దిగుతామని అమిత్‌షా శనివారంనాడు విస్పస్టంగా ప్రకటించారు.

Updated Date - 2023-01-01T16:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising