కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lalu Viral Video: నవ్వుతూ హాయిగా బ్యాడ్మింటన్ ఆడిన లాలూ.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-07-29T15:37:25+05:30

రాష్ట్రీయ జనతా దళ్ వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడారు. చిరునవ్వులు చిందిస్తూ ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Lalu Viral Video: నవ్వుతూ హాయిగా బ్యాడ్మింటన్ ఆడిన లాలూ.. వీడియో వైరల్

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (RJD) వ్యవస్థాపకుడు, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఎంతో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ (Badmintion) ఆడారు. చిరునవ్వులు చిందిస్తూ ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఆయన కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పడు ఆ వీడియో వైరల్ అవుతోంది.


లాలూ షార్ట్ వీడియోకు ఓ పాత హిందీ పాటను జోడించారు. ''భయపడటం నేర్చుకోలేదు, తల వంచడం నేర్చుకోలేదు. పోరాడారు, పోరాడుతూనే ఉంటారు, జైలుకి భయపడరు, చివరకు గెలుస్తారు'' అని తేజస్వి ఒక క్యాప్షన్ రాశారు. అవినీతి కేసుల్లో తన తండ్రి సాగించిన సుదీర్ఘ పోరాటం, ఆయన గొంతు అణిచివేసేందుకు కేంద్ర సంస్థలను బీజేపీ ఉసిగొలపడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ క్యాప్షన్ పెట్టారు.


లాలూ ప్రసాద్ యాదవ్ గత ఏడు నెలలుగా బీహార్‌ దూరంగా ఉంటున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 5న సింగపూర్‌లో కిడ్నీ శస్త్రచికిత్స చేయిచుకున్నారు.ఆయన కుమార్తె రోహిణి తన కిడ్నీ తండ్రికి ఇచ్చారు. గత ఫిబ్రవరిలో భారత్‌కు తిరిగి వచ్చిన లాలూ అప్పట్నించి ఢిల్లీలోని తన పెద్ద కూతురు మీసా భారతి ఇంట్లో ఉంటున్నారు. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన పలు కేసుల్లో జైలుశిక్షలు పడిన లాలూ ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా బెయిలుపై ఉన్నారు.

Updated Date - 2023-07-29T15:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising