ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వెళ్లం’

ABN, First Publish Date - 2023-05-25T11:08:22+05:30

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారపార్టీ ప్రకటించింది. ఢిల్లీలో అత్యాధునిక వసతులు, భద్రత నడుమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే(DMK) ప్రకటించింది. ఢిల్లీలో అత్యాధునిక వసతులు, భద్రత నడుమ నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ నెల 28వ తేది ప్రారంభించనున్నారు. అందుకు కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధాని కాదని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, డీపీఐ, ఎండీఎంకే తదితర పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో, తామ పార్టీ కూడా బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది.

మేం పాల్గొంటాం : అన్నాడీఎంకే

ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో అన్నాడీఎంకే(AIADMK) ఎంపీలు పాల్గొననున్నారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28వ తేది ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని రాష్ట్రపతికి బదులుగా ప్రధాని ప్రారంభించడాన్ని నిరసిస్తూ 19 ప్రతిపక్ష పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో తమ పార్టీ ఎంపీలు తంబిదురై, సీవీ షణ్ముగం పాల్గొంటారని తెలియజేశారు.

Updated Date - 2023-05-25T11:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising