ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lucknow: లక్నో సీటీ పేరు మార్పుపై డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన

ABN, First Publish Date - 2023-02-08T14:03:20+05:30

లక్నో సిటీ పేరు మార్పు డిమాండ్‌పై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సంచలన ప్రకటన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: లక్నో (Lucknow) సిటీ పేరు మార్పు డిమాండ్‌పై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సంచలన ప్రకటన చేశారు. లక్నో అనేది లక్ష్మణ్ సిటీ అనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. త్వరలోనే పేరు మార్పునకు సంబంధించిన అన్ని విషయాలను ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తెలియజేస్తుందన్నారు. బదోహిలో బుధవారంనాడు పర్యటించిన మంత్రి వివిధ పథకాలు, అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. సురియావా ప్రాంతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్నో పేరు మార్చాలంటూ బపీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా డిమాండ్‌పై మంత్రి ప్రకటన చేశారు. లక్నో అనేది లక్ష్మణుడి సిటీ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. లక్నో పేరును 'లక్ష్మణ్ నగర్‌'గా మార్చేందుకు తదుపరి చర్చలు జరుగుతున్నట్టు సంకేతాలిచ్చారు.

రాహుల్‌కు మతిస్థిమితం తప్పింది..

మరోవైపు, కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై బ్రిజేష్ పాఠక్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మానసిక స్థితి పూర్తిగా అదుపు తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అవినీతితో తలమునకలయ్యేదని అన్నారు. బొగ్గు కుంభకోణాలు, కామన్‌వెల్త్ కుంభకోణం వంటి ఎన్నో కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే చోటుచేసుకున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని, రాహుల్‌కు పూర్తిగా మతిస్థిమితం తప్పిందని అన్నారు.

పేరు మార్పుపై గుప్తా డిమాండ్

కాగా, ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైన లక్నోను లఖన్‌పూర్‌గా కానీ, లక్ష్మణ్‌పూర్‌గా కానీ మార్చాలని బీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. గతంలో దీనికి లఖన్‌పూర్ అనే పేరు ఉండేదని, త్రేతాయుగంలో లక్ష్మణ్‌పూర్‌గా పిలిచేవారని అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లక్నోగా పేరు మార్చాడని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్‌పూర్, లక్ష్మణ్‌పూర్‌ అని పిలిచేవారని వివరించారు. ఈ మేరకు అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. అమృత్ కాల్‌లో అయినా భవిష్యత్ తరాల వారికి భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పదిలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2023-02-08T14:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising