ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madhya Pradesh: గెలిచిన ఎమ్మెల్యేలలో 90 మంది క్రిమినల్ కేసులున్న వారే..

ABN, First Publish Date - 2023-12-06T18:14:44+05:30

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 230 మంది ఎమ్మెల్యేలలో 90 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 39 మంది శాతం ఎమ్మెల్యేలు ఈ కోవలోకి వస్తారు. వీరిలోనూ సీరియస్ క్రిమినల్ కేసులున్న వారు 34 మంది, అంటే 15 శాతంగా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ అసోసిషేయన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన రిపోర్ట్‌లో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 230 మంది ఎమ్మెల్యేలలో 90 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 39 మంది శాతం ఎమ్మెల్యేలు ఈ కోవలోకి వస్తారు. వీరిలోనూ సీరియస్ క్రిమినల్ కేసులున్న వారు 34 మంది, అంటే 15 శాతంగా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ అసోసిషేయన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన రిపోర్ట్‌లో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేర, ఆర్థిక, విద్యావిషయక నేపథ్యాలను ఈ సంస్థ వెల్లడిస్తుంటుంది


క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలలో బీజేపీదే పైచేయి..

క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ గెలిచిన 90 మంది ఎమ్మెల్యేలలో 51 మంది బీజేపీకి చెందిన వారు ఉండగా, 38 మంది కాంగ్రెస్ పార్టీకి, ఒకరు భారతీయ ఆదివాసి పార్టీకి చెందిన వారున్నారు. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత ఎన్నికల్లో 94 మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొనగా, వీరిలో 47 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.


కరోడ్‌పతి ఎమ్మెల్యేలు 89 శాతం

మరో ఆసక్తికరమైన అశం ఏమిటంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 230 ఎమ్మెల్యేలలో 205 మంది, అంటే 89 శాతం మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 144 మంది బీజేపీకి, 61 మంది కాంగ్రెస్‌కు చెందినవారున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో 187 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కోటీశ్వరులుగా ఉన్నారు.


ఏడీఆర్ తాజా నివేదక ప్రకారం, రత్లాం జిల్లాలోని రత్లాం సిటీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రూ.296 కోట్లతో సంపన్న కోటీశ్వరుడిగా మొదటి స్థానంలో నిలిచారు. కట్ని జిల్లా విజయరాఘవగఢ్ అసెంబ్లీ సీటులో గెలిచిన బీజేపీపి ఎమ్మెల్యే సత్యేంద్ర పాఠక్ రూ.242 కోట్ల విలువచేసే ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో రూ.134 కోట్ల విలువైన ఆస్తులను కాంగ్రెస్ ఎమ్మెల్యే కమల్‌నాథ్ కలిగి ఉన్నారు.


ఎమ్మెల్యేల విద్యార్హతలివే..

గెలిచిన ఎమ్మెల్యేలలో 161 మంది గ్రాడ్యుయేట్లు, అంతకు మించిన విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు. 64 మంది అభ్యర్థులు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివిన వారున్నారు. ముగ్గురు విజేతలు డిప్లమో హోల్డర్లు కాగా, ఇద్దరు కొద్దిగా మాత్రమే చదువుకున్నారు. మొత్తం 230 మంది గెలిచిన అభ్యర్థులలో 27 మంది మాత్రమే (12 శాతం) మహిళలు ఉన్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. గతంలో ఈ సంఖ్య 21 అంటే 9 శాతంగా ఉంది.

Updated Date - 2023-12-06T18:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising