ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Madhya Pradesh: ఇసుక మాఫియా ఘాతుకం.. రెవెన్యూ అధికారిని ట్రక్కుతో తొక్కించి చంపేసిన వైనం

ABN, First Publish Date - 2023-11-26T16:38:24+05:30

మధ్యప్రదేశ్‌లోని ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఒక పట్వారిని ట్రక్కుతో తొక్కించి ప్రాణాలు తీసింది. షహడోల్ జిల్లా సన్ రీవర్‌ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

షహడోల్: మధ్యప్రదేశ్‌లోని ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఒక పట్వారి (Revenue official)ని ట్రక్కుతో తొక్కించి ప్రాణాలు తీసింది. షహడోల్ జిల్లా సన్ రీవర్‌ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.


అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పట్వారి ప్రసన్న సింగ్‌తో కూడిన గస్తీ బృందం గోపాల్‌పుర ప్రాంతంలో సన్ రీవర్ వద్దకు చేరుకుంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రక్-ట్రాలీని అడ్డుకునేందుకు పట్వారి సింగ్ ప్రయత్నించగా ట్రక్కు డ్రైవర్ ఆయన మీదుగా వాహనం నడిపించాడు. దీంతో పట్వారి సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం డ్రైవర్ పారిపోగా, అతనిని 25 ఏళ్ల శుభం విశ్వకర్మగా గుర్తించి ఆదివారం ఉదయం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ 302 (హత్య) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-11-26T16:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising