ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhyapradesh: కునో నేషన్ పార్క్‌లో నమీబియా చిరుత సాషా మృతి

ABN, First Publish Date - 2023-03-27T22:45:35+05:30

మధ్యప్రదేశ్‌: కునో నేషనల్ పార్క్‌(Kuno National Park)లో నమీబియా చిరుత సాషా(Sasha) మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మధ్యప్రదేశ్‌: కునో నేషనల్ పార్క్‌(Kuno National Park)లో నమీబియా చిరుత (Namibian Cheetah) సాషా(Sasha) మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన మొదటి బ్యాచ్‌ చిరుతల్లో(cheetahs) ఒకటైన సాశా(Sasha) సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో సాశా మృతిచెందినట్లు పార్క్ అధికారులు తెలిపారు. కాగా గతేడాది ఈ చిరుతలను ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వదిలారు.

జనవరి 22న అస్వస్థతతో కనిపించిన సాశాకు పార్క్ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాషాలో అలసట, బలహీనత ఉన్నట్లు తెలియడంతో వైద్య పరీక్షలు నిర్వంచగా డీహైడ్రేషన్, కిడ్నీసంబంధిత సమస్యల(Kidney infection)తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఇతర చిరుత(cheetahs)లు ఆరోగ్యంగా ఉన్నాయని పార్క్ అధికారులు తెలిపారు.

భారతదేశంలోని జాతుల జనాభాను పునరుద్ధరించే లక్ష్యంతో ప్రధాని మోదీ గతేడాది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి వదిలిన మొదటి బ్యాచ్‌ నమీబియా చిరుత్లో ఐదు ఆడ చిరుతలలో సాశా ఒకటి. సెప్టెంబరు 17న కునోలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఐదేళ్ల వయసున్న రెండు ఆడ చిరుత ఒకటి. అదే గత ఏడాది తన పుట్టినరోజు కూడా.

గతవారం, మధ్యప్రదేశ్‌లో ఎల్టన్, ఫ్రెడ్డీ అనే మరో రెండు చిరుతలను అడవిలోకి వదిలారు. దీంతో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో నాలుగింటిని షియోపూర్ జిల్లాలోని పార్క్‌లోని అడవిలోకి వదిలారు. ఎనిమిది నమీబియా చిరుతల్లో 5ఆడ, 3మగ ఉన్నాయి. భారతదేశంలోని జాతుల జనాభాను పునరుద్ధరించే లక్ష్యంతో కునో నేషనల్ పార్క్‌కు తీసుకురాబడ్డాయి.

మరో డజను చిరుతలను( 7మగ, 5ఆడ) ఫిబ్రవరి 18 న దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చారు. వీటితో కలిపి ఇప్పుడు 20 చిరుతలకు కునో పార్క్ నిలయంగా ఉంది. రాబోయే దశాబ్దంలో ఆసియా దేశానికి డజన్ల కొద్దీ ఆఫ్రికన్ చిరుతలను పరిచయం చేయడానికి దక్షిణాఫ్రికా భారతదేశంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది.

Updated Date - 2023-03-27T22:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising