CM Mohan Yadav: మొదటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
ABN, Publish Date - Dec 13 , 2023 | 08:32 PM
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మొదటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశించారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లు, అనియంత్రిత వినియోగంపై మాత్రమే నిషేధం విధించారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
భోపాల్: మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మొదటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశించారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లు, అనియంత్రిత వినియోగంపై మాత్రమే నిషేధం విధించారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సాధారణ, నియంత్రిత వాడకంపై ఎటువంటి పరిమితి లేదని స్పష్టతనిచ్చారు. నియంత్రిత లౌడ్‌స్పీకర్‌లు, నిర్ణీత డెసిబెల్ పరిమితుల్లో ఉపయోగించడానికి అనుమతిస్తారని మధ్యప్రదేశ్ ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. నిబంధనలకు లోబడి ఉపయోగించే లౌడ్ స్పీకర్లపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలుస్తోంది.
కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ మంగూభాయ్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ హాజరయ్యారు.
Updated Date - Dec 13 , 2023 | 08:32 PM