ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arun Gandhi: మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత

ABN, First Publish Date - 2023-05-02T19:58:21+05:30

మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ కన్నుమూశారు.

Mahatma Gandhis grandson Arun Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్హాపూర్: మహాత్మాగాంధీ మనవడు (Mahatma Gandhi’s grandson), ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ (Arun Gandhi) కన్నుమూశారు. 89 సంవత్సరాల అరుణ్ గాంధీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంత్యక్రియలు మహారాష్ట్ర (Maharashtra) కోల్హాపూర్‌లో (Kolhapur) నిర్వహిస్తామని ఆయన కుమారుడు తుషార్ గాంధీ (Tushar Gandhi) వెల్లడించారు.

1934 ఏప్రిల్ 14న మనిలాల్ గాంధీ, సుశీలా మశ్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ డర్బన్‌లో జన్మించారు. తాత మహాత్మాగాంధీ(Mahatma Gandhi) అడుగుజాడల్లో జీవించారు.

వాస్తవానికి అరుణ్ గాంధీ గత 24 సంవత్సరాలుగా అనురాధ భొసాలే అనే సామాజిక కార్యకర్త నిర్వహిస్తున్న అవని సంస్థను తరచూ సందర్శిస్తుంటారు. ఈ స్వచ్ఛంద సంస్థ బాలికలు, మహిళలు, నిరాశ్రయులైన మహిళల ఉద్ధరణ కోసం పనిచేస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అవని సంస్థను సందర్శించేందుకు వచ్చిన అరుణ్ గాంధీకి జ్వరం వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించగా ఆయన కోలుకున్నారు. తిరిగి ఆయన్ను అవని సంస్థకు తీసుకువచ్చారు. పర్యటనలు చేయవద్దని, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. నిన్న రాత్రి ఆయన ఉత్తరాలు రాస్తూ ఎక్కువ సమయం గడిపారు. ఉదయానికి ఆయన కన్నుమూశారు.

Updated Date - 2023-05-02T19:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising