ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahua Moitra Case: లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా..తిరిగి ఎప్పుడంటే..?

ABN, First Publish Date - 2023-11-06T18:26:04+05:30

డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై ముసాయిదా నివేదికను రూపొందించేందుకు జరగాల్సిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7న కమిటీ సమావేశం కావాల్సి ఉంది.

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేశారన్న (Cash for query) ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై ముసాయిదా నివేదికను రూపొందించేందుకు జరగాల్సిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ (Ethics committee) సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7న కమిటీ సమావేశం జరపాలని నిర్ణయించారు. అయితే సమావేశం నవంబర్ 9కి వాయిదా పడింది. వాయిదాకు కారణం ఏమిటనేది అధికారికంగా వెల్లడించలేదు.


మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఎథిక్స్ కమిటీ సభ్యులు ఇంతకుముందు నవంబర్ 2న సమావేశమైనప్పటికీ పార్టీలవారిగా విడిపోయారు. 15 మంది సభ్యుల కమిటీలో మెజారిటీ సభ్యులు బీజేపీకి చెందినవారే కావడంతో మహువా మొయిత్రాపై కఠిన చర్యలు ఉండవచ్చనే అభిప్రాయం ఉంది. సోంకర్ గత సమావేశంలో అనవసరమైన, వ్యక్తిగత ప్రశ్నలు అడిగారంటూ మొయిత్రా తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఆమె వ్యాఖ్యలను సోంకర్ ఖండించారు. మొయిత్రా సెంటిమెంట్లను కొందరు కమిటీ సభ్యులు నిలదీయడంతో పాటు నవంబర్ 2న జరిగిన సమావేశం నుంచి వారు వాకౌట్ చేశారు.


అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని తరఫున మొయిత్రా ఆయన వద్ద డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేసేవారని నిషాకాంత్ డూబే ఆరోపణగా ఉంది. మొయిత్రా లాగిన్‌ క్రెడెన్షియల్స్ తీసుకుని దుబాయ్‌తో సహా వివిధ లొకేషన్ల నుంచి ఆయన ప్రశ్నలు సబ్మిట్ చేసినట్టు డూబే ఆరోపించారు. మొయిత్రా తన లాగిన్‌ను షేర్ చేసిన విషయాన్ని ఒప్పుకుంటూనే, ఆర్థిక లావాదేవీలు ఏవీ ఇందులో లేవని చెప్పారు. చాలా మంది ఎంపీలు తమ లాగిన్ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేస్తుంటారని కూడా వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-11-06T18:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising