Mallikarjun Kharge: ఎర్రకోట వద్ద ఉత్సవాలకు ఎందుకు హాజరుకాలేదంటే..?
ABN, First Publish Date - 2023-08-16T15:38:06+05:30
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు. మొదటగా తాను కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాయని, రెండవది ప్రోటోకాల్ ప్రకారం తన నివాసం వద్ద ఉదయం 9.20 గంటలకు త్రివర్ణ పతాకం ఎగురవేశానని చెప్పారు.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Karge) బుధవారంనాడు వివరణ ఇచ్చారు. మొదటగా తాను కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాయని, రెండవది ప్రోటోకాల్ ప్రకారం తన నివాసం వద్ద ఉదయం 9.20 గంటలకు త్రివర్ణ పతాకం ఎగురవేశానని చెప్పారు.
''కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం మా ఇంటి వద్ద 9.20 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి అక్కడ కూడా జెండా ఎగురవేయాల్సి ఉంది. దాంతో ఎర్రకోట వద్దకు చేరుకోలేకపోయాను. అక్కడ సెక్యూరిటీ కూడా చాలా కట్టుదిట్టం చేశారు. ప్రధాని వెళ్లకుండా ఎవరినీ వెళ్లనీయరు. దీంతో సకాలంలో సభా స్థలి వద్దకు చేరుకోలేని భావించాను. భద్రతా కారణాలు, సమయాభావం కారణంగా తాను వెళ్లకపోవడమే మంచిదని అనుకున్నాను'' అని మీడియాకు ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నికైన తర్వాత వచ్చిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఇది కావడం విశేషం.
బీజేపీ విసుర్లు..
ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఖర్గే పాల్గొనకపోవడంపై బీజేపీ విసుర్లు విసిరింది. ఖర్గేకి ఒంట్లో బాగోలేదని, అందుకే రాలేకపోయారని కొందరు చెప్పారని, అయితే వెంటనే ఆయన కోలుకుని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో స్పీచ్ ఇవ్వడం, జెండా ఎగురవేయడం సంతోషమని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ వెంటనే స్పందించింది. ఖర్గే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో బిజీగా ఉన్నారని, అనేక మంత్రి మంత్రులు కూడా రెడ్ ఫోర్ట్ కార్యక్రమానికి హాజరుకాలేదని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా అన్నారు.
Updated Date - 2023-08-16T15:46:48+05:30 IST