ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan:వీడు మనిషేనా? తమ్ముడిని 8 సార్లు ట్రాక్టర్‌తో తొక్కించిన అన్న.. భూవివాదమే కారణం

ABN, First Publish Date - 2023-10-25T15:50:25+05:30

రాజస్థాన్‌(Rajasthan)లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరుల మధ్య భూవివాదం(Land Issue) దారుణ హత్యకు దారి తీసింది. సోదరుడిని ట్రాక్టర్(Tractor Attack) తో 8 సార్లు తొక్కించి హత్య చేశాడు ఓ కసాయి అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పుర్‌కి చెందిన బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాలు గ్రామంలోని కొంత భూమిపై ఏళ్లుగా గొడవపడుతున్నారు.

జైపుర్: రాజస్థాన్‌(Rajasthan)లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరుల మధ్య భూవివాదం(Land Issue) దారుణ హత్యకు దారి తీసింది. సోదరుడిని ట్రాక్టర్(Tractor Attack) తో 8 సార్లు తొక్కించి హత్య చేశాడు ఓ కసాయి అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పుర్‌కి చెందిన బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాలు గ్రామంలోని కొంత భూమిపై ఏళ్లుగా గొడవపడుతున్నారు. ఇవాళ ఉదయం రెండు కుటుంబాలు వివాదాస్పద భూమిపై చర్చించుకోవడానికి ఒక చోట చేరాయి. మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఘర్షణ సమయంలో, అతర్ సింగ్ కుమారులలో ఒకరైన నిర్బత్ నేలపై పడిపోయాడు. అప్పటికే ట్రాక్టర్ పై ఉన్న నిర్బత్ సోదరుడు వాహనాన్ని ఆయనపై నుంచి వాహనాన్ని పోనించాడు. అలా ట్రాక్టర్ ని ముందుకు వెనక్కి తిప్పుతూ 8 సార్లు నిర్బత్ పై నుంచి నడిపాడు. తీవ్ర గాయాలపాలైన నిర్బత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు బాధిత కుటుంబ సభ్యులు ఆపాలని ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘర్షణలో దాదాపు 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే రెండు కుటుంబాలు ఘర్షణ పడుతున్నప్పుడు తుపాకుల శబ్దాలు వినిపించాయని గ్రామస్థులు అంటున్నారు.


మండిపడిన బీజేపీ..

ఈ ఘటనపై రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్‌పై బీజేపీ(BJP) విరుచుకుపడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanaka Gandhi Vadra)పై బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. "ఎన్నికల రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ.. భరత్ పుర్ ని సందర్శించాలి. కాంగ్రెస్ ఏలుబడిలో శాంతిభద్రతలు(Law and Order) ఎంతలా దిగజారాయనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. వీడియో చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. కాంగ్రెస్ నేతలు ఈ ఘటనపై ఏం చెబుతారు. రాష్ట్రంలో నేర సంస్కృతి రోజు రోజుకీ పెరిగిపోతోంది" అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముంగిట కాంగ్రెస్(Congress)కు ఈ పరిణామం కంటగింపుగా మారే చాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2023-10-25T15:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising