ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur CM: మణిపూర్‌ త్వరలోనే చక్కబడుతుంది: బీరేన్ సింగ్

ABN, First Publish Date - 2023-07-28T21:04:42+05:30

రెండు నెలలకు పైగా హింసాకాండతో విలవిల్లాడుతున్న మణిపూర్‌లో త్వరలోనే యథాపూర్వ పరిస్థితిలు నెలకొంటాయని, అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తెలిపారు. సీఎం రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. మణిపూర్ ప్రజల కోసం తాను పనిచేస్తున్నానని చెప్పారు.

ఇంఫాల్: రెండు నెలలకు పైగా హింసాకాండతో విలవిల్లాడుతున్న మణిపూర్‌ (Manipur)లో త్వరలోనే యథాపూర్వ పరిస్థితిలు నెలకొంటాయని, అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N.Biren singh) తెలిపారు. సీఎం రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తు్న్న డిమాండ్‌ను ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తోసిపుచ్చారు. మణిపూర్ ప్రజల కోసం తాను పనిచేస్తున్నానని చెప్పారు.


''వాళ్లు (విపక్షాలు) కచ్చితంగా నేను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. కానీ నేను వాళ్ల కోసం పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తు్న్నారు. రాష్ట్రంలో తక్షణం శాంతి నెలకొల్పడమే నా మొదటి ప్రాధాన్యత. ప్రజలకు స్వాంతన కలిగించేందుకు, కుకీ సోదరులతో సంప్రదింపులు జరిపేందుకు బృందాలను పంపాం. వారిని కలవాల్సిందిగా కుకీ సోదరులకు విజ్ఞప్తి చేస్తు్న్నాను. మెయిటీ సోదరులతోనూ సంప్రదింపుల కోసం బృందాలను పంపాం. రాష్ట్రంలో తిరిగి అల్లర్ల ముందు నాటి పరిస్థితిని పాదుకొల్పడమే నా తక్షణ కర్తవ్యం'' అని బీరేన్ సింగ్ తెలిపారు. మణిపూర్ తమ రాష్ట్రమని, కుకీలు, నాగాలు, మెయితీలు అంతా తన ప్రజలేనని, వారితోనే తాను జీవనం సాగిస్తానని చెప్పారు. జరిగిన ఘటలన్నీ దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు కారణాలపై అడిగినప్పుడు, దానిని సమగ్రంగా తాను వివరించలేనని, దీనిపై దర్యాప్తు కమిషన్ పూర్తి వివారాలు వెల్లడిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తు్న్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుకీలు,మెయితీల మధ్య శాంతి చర్చల ప్రక్రియను మోదీ, షా ప్రారంభించడం శుభారంభమని అన్నారు.

Updated Date - 2023-07-28T21:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising