Manipur: చొరబాటుదారుల ఘాతుకం.. పోలీసు అధికారి కాల్చివేత
ABN, First Publish Date - 2023-10-31T20:48:37+05:30
జాతుల మధ్య ఘర్షణతో అట్టుడికి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న మణిపూర్ మరోసారి ఉలిక్కిపడింది. మయనార్మ్‌తో సరిహద్దులకు సమీపంలోని మోరే ప్రాంతంలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి చింగ్తం ఆనంద్‌పై చొరబాటులు మంగళవారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న మణిపూర్ మరోసారి ఉలిక్కిపడింది. మయనార్మ్‌తో సరిహద్దులకు సమీపంలోని మోరే (Moreh) ప్రాంతంలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి (SDPO) చింగ్తం ఆనంద్ (Chingtham Anand)పై చొరబాటులు మంగళవారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్ది నెలల క్రితం ఇదే మోరే ప్రాంతంలో మైతేయి, కుకీ తెగల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి.
సీఎం ఖండన, మంత్రివర్గంతో అత్యవసర సమావేశం
పోలీసు అధికారిని చొరబాటుదారులు కాల్చిచంపడంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండించారు. 'కోల్డ్ బ్లడెడ్ కిల్లింగ్'గా దీనిని పేర్కొన్నారు. నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రివర్గంతో సీఎం అత్యవసర సమావేశం జరిపారు. ఈ సమావేశంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద 'వరల్డ్ కుకీ-జో ఇంటెలెక్చువల్ కౌన్సిల్' సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా కేబినెట్ ప్రతిపాదించింది.
Updated Date - 2023-10-31T20:52:02+05:30 IST