ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur Files: కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ తీయాలి: సామ్నా సంపాదకీయం

ABN, First Publish Date - 2023-07-22T18:12:21+05:30

మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎండగట్టింది. 'మణిపూర్ ఫైల్స్' పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది.

ముంబై: మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం (Shiv Sena UBT) ఎండగట్టింది. 'మణిపూర్ ఫైల్స్' (Manipur files) పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది. మణిపూర్‌ను కుదిపేస్తున్న హింసాకాడకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ బాధ్యత వహించాలని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' (Samna) శనివారంనాడు ప్రచురించిన సంపాదకీయంలో ఘాటుగా విమర్శించింది.


మణిపూర్‌లో మే 2న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరింగించిన దృశ్యాలతో కూడిన వీడియో గత బుధవారనాడు వెలుగుచూసిన విషయాన్ని సంపాదకీయం ప్రస్తావించింది. ఈ ఉదంతాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి ఉండకపోతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసలు పెదవి విప్పే వారే కాదని వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం ఉంటే ఈపాటికే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఉండేవారని పేర్కొంది. ఇటీవల కాలంలో 'ది కశ్మీర్ ఫైల్స్', 'తాష్కెంట్ ఫైల్స్', 'ది కేరళ సోర్టీ' చిత్రాలు రూపొందాయని, మణిపూర్ హింసాకాండపై కూడా ఆ వ్యక్తులే ఇప్పుడు 'మణిపూర్ ఫైల్స్' సినిమా తీయాలని సూచించింది. ప్రధాన మంత్రి దృష్టిలో మణిపూర్‌కు ఏమాత్రం రాజకీయంగా ప్రాధాన్యత లేదని, ఆ కారణంగానే ఆ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తు్న్నారని విమర్శించింది. మణిపూర్‌లో 60,000 మంది కేంద్ర పారామిలటరీ బలగాలు ఉన్నప్పటికీ హింసకు తెరపడలేదని, దీనిని బట్టి అక్కడి పరిస్థితి ప్రధాని, కేంద్ర హోం మంత్రి చేతుల్లో లేదనే విషయం అవగతమవుతోందని సామ్నా సంపాదకీయం తెలిపింది.

Updated Date - 2023-07-22T18:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising