ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur: తిరుగుబాటు గ్రూపుతో శాంతి చర్చలు: సీఎం

ABN, First Publish Date - 2023-11-26T15:54:26+05:30

హింసాకాండతో ఇటీవల అట్టుడికిన మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రాష్ట్రం ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. మణిపూర్‌ లోయలోని ఒక తిరుగుబాటు సంస్థతో శాంతి చర్చలు జరుపుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు తెలిపారు. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని వెల్లడించారు.

ఇంఫాల్: హింసాకాండతో ఇటీవల అట్టుడికిన మణిపూర్‌ (Manipur)లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రాష్ట్రం ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. మణిపూర్‌ లోయలోని ఒక తిరుగుబాటు సంస్థ (Insurgent group)తో శాంతి చర్చలు జరుపుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N.Biren Singh) ఆదివారంనాడు తెలిపారు. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే, ఆ సంస్థ పేరును ఆయన వెల్లడించలేదు. మే 3న మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ పెద్దఎత్తున హింసాకాండకు దారితీసిన అనంతరం అజ్ఞాత తిరుగుబాటు సంస్థతో శాంతి చర్చలు జరుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం ఇదే మొదటిసారి.


కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)తో ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మెయితీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగల హోదా కల్పించాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా గత మేలో 'గిరిజన సంఘీభావ ప్రదర్శన' నిర్వహించిన అనంతరం పెద్దఎత్తున రాష్ట్రంలో హింసాకాండ చెలరేగింది. ఈ హింసాకాండలో 180కి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మెయితీలు ఉండగా, వీరిలో ఎక్కువ మంది ఇంఫాల్ వ్యాలీలో ఉంటున్నారు. నాగాలు, కుకీలతో సహా గిరిజన కమ్యూనిటీ ప్రజలు 40 శాతం వరకూ ఉండగా, వీరు కొండ ప్రాంత జిల్లాల్లో నివసిస్తున్నారు.

Updated Date - 2023-11-26T15:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising