ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur : మణిపూర్ పరిస్థితిపై మాతో గవర్నర్ ఏకీభవించారు : ప్రతిపక్ష ఇండియా ఎంపీలు

ABN, First Publish Date - 2023-07-30T12:07:46+05:30

తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని మణిపూర్ గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey)ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి, సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడారు.

DMK MP Kanimozhi talking with Manipur people

ఇంఫాల్ : తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని మణిపూర్ గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey)ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి, సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడిన తర్వాత ఈ ఎంపీలు గవర్నర్‌ను ఆదివారం కలిసి, ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. తాము చెప్పిన మాటలతో ఆమె ఏకీభవించారని ఎంపీలు మీడియాకు తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలు సంయుక్తంగా గవర్నర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. గవర్నర్ స్పందిస్తూ, రాష్ట్రంలోని పరిస్థితులపై తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. శని, ఆదివారాల్లో తాము రాష్ట్రంలో పర్యటించామని, తాము అనేక అంశాల గురించి తెలుసుకున్నామని చెప్పారు. ఈ వివరాలను తాము గవర్నర్ వద్ద ప్రస్తావించామని తెలిపారు. తాము చెప్పిన మాటలతో గవర్నర్ ఏకీభవించారని తెలిపారు. అన్ని తెగలవారితోనూ సమావేశాలను ఏర్పాటు చేసి, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని ఆమె చెప్పారన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపించాలని సలహా ఇచ్చారని చెప్పారు. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పారదోలడానికి, సమస్యను పరిష్కరించడానికి అన్ని తెగల ప్రతినిధులతోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారన్నారు.


ఇండియా కూటమి ఎంపీల పర్యటన

మణిపూర్‌లో కుకీలు-మెయిటీల మధ్య మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. సాధారణ స్థితిని పునరుద్దరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకుని, పార్లమెంటుకు చెబుతామంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు శని, ఆదివారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ బృందం శనివారం ఇంఫాల్, మొయిరంగ్, చురాచాంద్ పూర్‌లలోని సహాయక శిబిరాలను సందర్శించి, బాధితులతో మాట్లాడింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇండియా (I.N.D.I.A) కూటమి మాత్రమే నిరంతరం మణిపూర్‌లో పర్యటిస్తోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిల పక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తానంటే, తాము సంతోషంగా భాగస్వాములమవుతామని తాము ఎల్లప్పుడూ చెప్తున్నామన్నారు. మణిపూర్‌లో ప్రశాంతత ఏర్పడాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలతో మాట్లాడాలని, వారి సమస్యలను పార్లమెంటుకు తెలియజేయాలని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. తాము నాలుగు సహాయక శిబిరాలను సందర్శించామని, వీటిలో రెండు శిబిరాలు చురాచాంద్‌పూర్‌లో, ఒకటి ఇంఫాల్‌లో, మరొకటి మొయిరాంగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, వారి జీవితాలు బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. మణిపూర్ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, పార్లమెంటుకు చెబుతామన్నారు.

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి బిష్ణుపూర్‌ జిల్లాలోని ఓ సహాయక శిబిరంలో బాధితులతో శనివారం మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ బాధితులను కలవాలని, వారిని ఓదార్చాలని కోరారు. మణిపూర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. సత్వరమే శాంతిని పునరుద్ధరించాలన్నారు. న్యాయం, సామరస్యం కొనసాగవలసి అవసరం చాలా ఉందని చెప్పారు. సాధారణ పరిస్థితిని పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్ధవ్ ఆగ్రహం

మహిళలను అవమానిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Shiv Sena (UBT) chief Uddhav Thackeray) శనివారం ఆరోపించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న (మోదీ) ప్రభుత్వం ధృతరాష్ట్రుని మాదిరిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

బాధితులకు సరైన సదుపాయాలు లేవు : కాంగ్రెస్

హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సరైన సదుపాయాలు లేవని కాంగ్రెస్ ఎంపీ ఫులోదేవి నేతమ్ చెప్పారు. కేవలం ఒక హాలులో 400 నుంచి 500 మంది వరకు ఉంటున్నారని, వీరికి కనీస సదుపాయాలు లేవని, మరుగుదొడ్డి సదుపాయం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం పప్పు, అన్నం మాత్రమే ఇస్తోందన్నారు. బాలలకు తినడానికి ఏమీ ఉండటం లేదన్నారు. బాధితులు ఈ శిబిరాల్లో జీవిస్తున్న పరిస్థితి హృదయవిదారకంగా ఉందని తెలిపారు.

అంతకుముందు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాలని గవర్నర్‌ను కోరుతామని చెప్పారు. టీఎంసీ ఎంపీ సుస్మిత దేవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి సజావుగా లేదన్నారు. ప్రశాంతతను పునరుద్ధరించాలని గవర్నర్‌ను కోరుతామని తెలిపారు. రాష్ట్ర పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియజేయాలని కోరుతామన్నారు.

ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ ఆగ్రహం

బీజేపీ నేత అజయ్ ఆలోక్ మాట్లాడుతూ, ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు మణిపూర్‌లో పర్యాటకానికి వెళ్లారని దుయ్యబట్టారు. వారు పార్లమెంటులో చర్చించలేరని మండిపడ్డారు. అలాంటివారు మణిపూర్‌లో పరిస్థితిని ఏ విధంగా మదింపు చేస్తారని ప్రశ్నించారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వారు మణిపూర్‌లో పర్యటిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు మణిపూర్‌లో పర్యటించడం ఓ నాటకమని మండిపడ్డారు. గతంలో మణిపూర్ తగులబడినపుడు నేటి ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నెలల తరబడి మణిపూర్ స్తంభించిపోయినా, ఈ పార్టీలు కనీసం ఒక మాట అయినా మాట్లడలేదన్నారు.

బాధిత మహిళలకు రూ.10 లక్షలు సాయం

కుకీ-మెయిటీ తెగల మధ్య ఘర్షణల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు బాధిత మహిళలకు గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey) రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

అక్రమ చొరబాటుదారుల గుర్తింపు

మణిపూర్ రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన మయన్మార్ జాతీయులకు బయోమెట్రిక్ క్యాప్చర్ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం పునఃప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Gujarat : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 100 మంది రోగుల తరలింపు..

Moscow : మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. దెబ్బతిన్న రెండు భవనాలు..

Updated Date - 2023-07-30T12:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising