ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mayawati: లోక్‌సభ ఎన్నికల్లో సోలోగానే..

ABN, First Publish Date - 2023-08-23T17:50:16+05:30

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ) సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించింది. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని నెలరోజుల క్రితం బీఎస్‌పీ ప్రకటించింది.

లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి (Mayawati) సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నిర్ణయించింది. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని నెలరోజుల క్రితం బీఎస్‌పీ ప్రకటించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల విషయంలోనూ ఆ పార్టీ తాజాగా స్పష్టత ఇచ్చింది.


''లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేయాలంటే ప్రతిగామంలోనూ క్యాడర్‌ను పటిష్టం చేసుకోవాలి. సమాజంలోని అన్నివర్గాలనూ కలుపుకుని వెళ్లాలి. పార్టీ కార్యకర్తలకు గతంలో ఇచ్చిన అదేశాల పురోగతిని పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో మాయావతి సమీక్షించారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆమె ఆదేశించారు'' అని బీఎస్‌పీ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో పొత్తులు పెట్టుకున్నప్పుడు పార్టీ ఓట్లు భాగస్వాములకు పడ్డాయని, కానీ బీఎస్‌పీకి తమ ఓట్లు బదిలీ చేయాలనే ఆలోచన భాగస్వామ పార్టీలకు కలగలేదని ఆ ప్రకటన పేర్కొంది.


కాగా, త్వరలో జరుగనున్న రాజస్థా్న్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఎస్‌పీ ఒంటరిగా పోటీ చేస్తుందని గత నెలలో బీఎస్‌పీ ప్రకటించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను ఓడించేందుకు విపక్షాల ఐక్య కూటమి 'I.N.D.I.A.' ఏర్పాటయిన మరుసటి రోజే బీఎస్‌పీ ఈ ప్రకటన చేసింది. 2019 ఎన్నికల్లో బీఎస్‌పీ 10 సీట్లు గెలుచుకోగా, రాజ్యసభలో ప్రస్తుతం ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నారు.

Updated Date - 2023-08-23T17:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising