ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arvind Kejriwal: బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఐ-టీ సర్వేపై కేజ్రీ ఘాటు స్పందన

ABN, First Publish Date - 2023-02-15T15:49:23+05:30

బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన 'సర్వే'లపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన 'సర్వే'లపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారంనాడు ఘాటుగా స్పందించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో మూల స్తంభమని అన్నారు. మీడియా గొంతును అణిచివేయడమంటే ప్రజావాణిని అణిచివేయడమేనని అన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో ఒక ట్వీట్‌ చేశారు.

''ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమనేది ప్రజావాణిని అణిచివేయడంతో సమానం. బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఈ వ్యక్తులు (బీజేపీ) సీబీఐ, ఈడీ, ఐ-టీ శాఖలను వారిపై ఉసిగొలుపుతుంటారు'' అని కేజ్రీవాల్ ఆ ట్వీట్‌లో అన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, సంస్థలను అణిచివేయాలని బీజేపీ కోరుకుంటోందా? యావద్దేశాన్ని తమ బానిసలుగా చేయాలని కోరుకుంటోందా? అని ఆయన ప్రశ్నించారు.

బీబీసీ-మోదీ డాక్యుమెంటరీ వివాదం తర్వాత ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సర్వే జరిపింది. ఇవి దాడులు కావలని బీబీసీ సబ్సిడరీ కంపెనీలకు చెందిన అంతర్జాతీయ పన్ను విధానాలు, తదితరాలకు సంబంధించిన సర్వే మాత్రమేనని అధికారులు వివరణ సైతం ఇచ్చారు. ఈ అవకతవకలపై బీబీసీకి గతంలోనో నోటీసు లిచ్చినా పట్టించుకోలేదని, దీనికి తోడు భారీగా లాభాలను దారి మళ్లించిందని ఆ వర్గాల ఆరోపణగా ఉంది. అయితే, ఐ-టీ చర్య రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీబీసీ విష ప్రచారానికి పాల్పడుతోందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని, ది మోదీ క్వచ్ఛన్ పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయడం వారికి మింగుడు పడటం లేదని విపక్షాల అంటున్నాయి. బీబీసీ కార్యాలయాలపై దాడులు జరిగిన సమయం చూస్తుంటే ఇదే అభిప్రాయం కలుగుతోందని వారు విశ్లేషిస్తున్నారు.

కొనసాగుతున్న సర్వే ఆపరేషన్..

కాగా, బీబీసీ ఇండియా కార్యాలయాలపై రెండో రోజైన బుధవారంనాడు కూడా ఐటీ సర్వే ఆపరేషన్ కొనసాగుతోంది. సర్వే పూర్తయ్యేంత వరకూ సిబ్బందిని కార్యాలయ ఆవరణను వీడేందుకు అనుమతించడం లేదు. వారి నుంచి సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీన చేసుకుంది. దర్యాప్తు అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్టు బీబీసీ ఒక ట్వీట్‌లో తెలిపింది.

Updated Date - 2023-02-15T15:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising