ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ashok Gehlot: వ్యక్తుల మధ్య మీడియా పుల్లలు పెట్టకూడదు..

ABN, First Publish Date - 2023-04-25T11:45:49+05:30

వ్యక్తుల మధ్య మీడియా గొడవలు సృష్టించకూడదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హితవు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: వ్యక్తుల మధ్య మీడియా గొడవలు సృష్టించకూడదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) హితవు పలికారు. సొంత పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తో (Sachin Pilot) నాయకత్వం విషయంలో విభేదాల నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో తన ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలపైనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఉంటుందని చెప్పారు. గత ఐదేళ్లుగా తమ ప్రభుత్వం చేసిన పనుల ఆధారంగానే మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లో 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం గెహ్లాట్, అశోక్ మధ్య జగడం కొనసాగుతోంది. వసుంధరా రాజే సారథ్యంలోని గత బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై గెహ్లాట్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ సచిన్ పైలట్ ఇటీవల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అవినీతిపై విచారణ జరిపిస్తామని 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో గెహ్లాట్ విఫలమైనట్టు పైలట్ ఆరోపణగా ఉంది. అయితే దీనిపై గెహ్లాట్ నేరుగా పైలట్‌పై ఎలాంటి విమర్శకు దిగకుండానే, వ్యక్తుల మధ్య మీడియా ఎలాంటి గొడవ పెట్టరాదని హితవు పలికారు.

''నిజాలు, వాస్తవాలకు మీడియా కట్టుబడాలి. మాలో మేము గొడవపడేలా మీడియా చూడరాదు. మీడియా తమ విధులు నిర్వరిస్తూ, ప్రజాప్రయోజనాలకు కట్టుబడాలి. సత్యమే ఆయుధంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి బాసటగా నిలబడాలి. వాస్తవాలకు వెన్నుదన్నుగా నిలబడాలి. మీడియాపై కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉంది. అయినప్పటికీ ప్రజాప్రయోజనాలకు మీడియా బాసటగా ఉండాలి'' అని గెహ్లాట్ అన్నారు. ఎన్నికల్లో ప్రధాని (నరేంద్ర మోదీ), అమిత్‌షా (హోం మంత్రి) భారీ రోడ్‌షోలు తీస్తూ, డబ్బులు ఖర్చుపెడుతూ, ఎన్నికల్లో గెలిచేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, కానీ తాము మాత్రం ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజాతీర్పు కోరుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులు చాలా మాట్లాడతారని, తాము మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ పనితాము చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఇచ్చిన హామీలకు, ప్రజాసేవకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-04-25T11:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising