MeToo Allegations: రెజ్లర్ల ఆందోళనకు స్టూడెంట్ యూనియన్స్ సంఘీభావం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఛీఫ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్
ABN, First Publish Date - 2023-05-03T19:17:14+05:30
ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University) ఆర్ట్స్ కాలేజీ(Arts College) ముందు ధర్నా చేపట్టిన విద్యార్థులు..
ఢిల్లీ: మహిళా రెజ్లర్ల(Women wrestlers) ఆందోళన(Protest)కు మద్దతుగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు(Student Unions) ఆందోళన చేపట్టాయి. లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఛీఫ్(Wrestling Federation of India chief ) బ్రిజ్ భూషణ్ శరణ్(Brij Bhushan Sharan Singh)ను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University) ఆర్ట్స్ కాలేజీ(Arts College) ముందు ధర్నా చేపట్టిన విద్యార్థులు వెంటనే బ్రిజ్ భూషన్ శరణ్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు అనుమతి లేదని ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఏప్రిల్23 నుంచి రెజ్లర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఓ మైనర్ రెజ్లర్‌తో సహా ఏడుగురు మహిళా రెజర్లు లైంగిక వేధింపులు, బెదిరింపులకు గురి చేసిన బ్రిజ్ భూషణ్ సింగ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళా రెజర్లు భవిష్యత్తులో లైంగిక వేధింపులు, బెదిరింపులకు గురి కాకుండా ఓ కమిటీని నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. పలువురు విద్యార్థులను పోలీసులు చితకబాదారు. మమ్మల్ని ఎందుకు లాగి నిర్బంధిస్తున్నారు?. ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించింది. మహిళా రెజ్లర్లను వేధించిన వ్యక్తికి రక్షణ లభిస్తోంది. అలాంటి వారిని ప్రశ్నించిన విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు" అని ఓ నిరసనకారుడు పోలీసు సిబ్బందిని ప్రశ్నించారు.
Updated Date - 2023-05-03T19:19:31+05:30 IST