Milk: Milk: అమ్మబాబోయ్ అంత రేటా.. పాల ధర లీటరుకు రూ.5 పెంచుతారట..
ABN, First Publish Date - 2023-06-23T11:37:49+05:30
పాల ధర లీటరకు ఐదు రూపాయల మేర పెంచాలని నిర్ణయించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా ఎన్నికైన భీమానాయక్ అ
- కేఎంఎఫ్ నూతన చైర్మన్ భీమానాయక్
- సీఎం అనుమతుల కోసం ఎదురుచూపులు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నందిని పాల ధర లీటరకు ఐదు రూపాయల మేర పెంచాలని నిర్ణయించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా ఎన్నికైన భీమానాయక్ అభిప్రాయపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన పాల ధర పెంచాలని నిర్ణయిచామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అనుమతుల కోసం వేచి చూస్తున్నామన్నారు. నాణ్యమైన పాలు, పెరుగు అందించే విషయంలో రాజీ లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల వ్యవధిలోనే పాలధరను పెంచడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా లీటరుకు ఐదు రూపాయలు పెంచడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరెంటు ఛార్జీలు పెంచిన వెంటనే పాలధరలు పెంచడాన్ని బట్టి సామాన్యుడి జేబుకు చిల్లుపడేలా ప్రభుత్వం చేసిందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.
Updated Date - 2023-06-23T11:37:49+05:30 IST