ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: సూడాన్‌లో మరో 200మంది తమిళులు

ABN, First Publish Date - 2023-04-30T07:41:12+05:30

సూడాన్‌ దేశంలో మరో 200 మంది తమిళులు చిక్కుకున్నట్లు తెలిసిందని మైనార్టీ సంక్షేమ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): సూడాన్‌ దేశంలో మరో 200 మంది తమిళులు చిక్కుకున్నట్లు తెలిసిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి సెంజి మస్తాన్‌(Minister Senji Mastan) తెలిపారు. సూడాన్‌లో అధికారం కోసం సైనికులు రెండు వర్గాలుగా మారి పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో, ఆ దేశంలో ఉన్న తమ వారిని తిరిగి వచ్చేయాలంటూ పలు దేశాలు పిలుపునిచ్చాయి. వారిని తీసుకొచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ పేరుతో సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. తొలివిడత సూడాన్‌(Sudan)లో చిక్కుకున్న వారిలో 9 మంది తమిళులు మూడ్రోజుల క్రితం రాష్ట్రానికి చేరుకోగా, రెండో విడతగా శనివారం మరో 9 మంది వచ్చారు. విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికిన మంత్రి సెంజి మస్తాన్‌ మీడియాతో మాట్లాడుతూ... చెన్నై(Chennai)కి చేరుకున్న వారి ద్వారా సూడాన్‌లో మరో 200 మంది చిక్కుకున్నట్లు తెలిసిందన్నారు. తమిళ సంగమం, రాయబార కార్యాలయం సహకారంతో ఆ దేశంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని, వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేలా కేంద్రప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తున్నామని మంత్రి తెలిపారు.

Updated Date - 2023-04-30T07:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising