Minister: ‘కరోనా’ ప్రమాదకరస్థితిలో లేదు.. అయినా జాగ్రత్తలు పాటించాల్సిందే..
ABN, Publish Date - Dec 21 , 2023 | 12:12 PM
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌గుండూరావు(Medical and Health Minister Dinesh Gundu Rao) సూచించారు.
- న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ఉండవు..
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌గుండూరావు(Medical and Health Minister Dinesh Gundu Rao) సూచించారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ ప్రయాణికులు, అంతర్రాష్ట్ర ప్రయాణికులపై నిఘా విధించాల్సిన పరిస్థితి లేదన్నారు. క్రిస్మస్ సహా నూతన సంవత్సర వేడుకలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవన్నారు. 60 సంవత్సరాలకు పైబడినవారు రద్దీ ప్రాంతాల్లో తిరిగే వేళ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తాజా కరోనా వేరియంట్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ముందుజాగ్రత్తగా గోవా, కేరళ(Goa, Kerala) రాష్ట్రాల నుంచి వస్తున్నవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే కొవిడ్ పరీక్షలు జరపాలని అధికారులకు సూచించామన్నారు. కొవిడ్ కథనాల విషయంలో మీడియా సంయమనం పాటించాలని, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉండరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే అత్యవసర సమావేశం అనంతరం అవసరమైతే కొవిడ్ మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తామన్నారు.
Updated Date - Dec 21 , 2023 | 12:13 PM