Minister: మంత్రి ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-04-05T11:45:23+05:30
డెల్టా జిల్లాలో బొగ్గు తవ్వకాలకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని యువజన
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డెల్టా జిల్లాలో బొగ్గు తవ్వకాలకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) స్పష్టం చేశారు. తిరువారూరులో మంగళవారం ఉదయం పార్టీ స్థానిక శాఖ సీనియర్, వృద్ధ నాయకులకు నగదు కానుకలందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయనిధి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను గుర్రపు బగ్గీపై ఊరేగించారు. అనంతరం ఆయన పార్టీ సీనియర్ నేతలకు నగదు కానుకలందించి శాలువలతో సత్కరించారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ సమావేశం తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తంజావూరు(Thanjavur) జిల్లా ఒరత్తనాడు వద్ద 11 ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలు చేపట్టనున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం సురక్షిత వ్యవసాయ మండలిగా ప్రకటించిన కావేరి డెల్టా జిల్లాలో చమురు, నేలబొగ్గు తవ్వకాలు జరిపేందుకు వీలులేదని, ఈ విషయాన్ని బుధవారం శాసనసభలో తాను ప్రస్తావిస్తానని చెప్పారు.
డెల్టా నాశనానికి కేంద్రం కుట్ర: అన్బుమణి
డెల్టా జిల్లాలను నాశనం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్(Dr. Anbumani Ramdas) విమర్శించారు. డెల్టా జిల్లాల్లో ముఖ్యంగా తమిళ ధాన్యాగారంగా పేరుగడించిన తంజావూరు జిల్లాలోని ఒరత్తనాడు వద్ద 11 చోట్ల నేలబొగ్గు తవ్వకాలు చేపట్టనున్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో డీఎంకే ప్రభుత్వం అప్రమత్తంగా వ్యహరించి తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. ఇదే విధంగా అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ కూడా డెల్టా జిల్లాల్లో బొగ్గు తవ్వకాలకు అనుమతివ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-04-05T11:45:23+05:30 IST