ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: ఆ విషయంపై కేంద్రంతో మాట్లాడతాం.. త్వరలో ఢిల్లీకి వెళతా..

ABN, First Publish Date - 2023-06-01T09:02:59+05:30

మూడు ప్రభుత్వ వైద్యకళాశాలల అనుమతిని యూజీ వైద్య విద్యా డైరెక్టరేట్‌ రద్దు చేసిన వ్యవహారంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): మూడు ప్రభుత్వ వైద్యకళాశాలల అనుమతిని యూజీ వైద్య విద్యా డైరెక్టరేట్‌ రద్దు చేసిన వ్యవహారంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించిన అనంతరం ఆరోగ్యశాఖ అధికారులతో కలసి తాను ఢిల్లీ వెళ్లనున్నట్లు మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. చెన్నై స్టాన్లీ, తిరుచ్చి, ధర్మపురి ప్రభుత్వ వైద్యకళాశాలలను పరిశీలించిన జాతీయ వైద్య కమిషన్‌, ఆ కళాశాల్లో బయోమెట్రిక్‌ విధానంలో అటెండెన్స్‌ లోపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు సంతృప్తికరంగా లేవంటూ డైరెక్టరేట్‌కు నోటీసులు పంపించింది. దీంతో, ఆ మూడు వైద్యకళాశాలల అనుమతులు ఉపసంహరించుకుంటున్నట్లు జాతీయ వైద్య కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఉదయం స్థానిక తేనాంపేట డీఎంఎస్‌ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ పొగాకు నిరోధక దినంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఈ వ్యవహారంపై స్పందించారు. మూడు ప్రభుత్వ వైద్యకళాశాలల అనుమతుల రద్దుపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు ఇప్పటికే తమిళనాడు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లిందని, సీఎం స్టాలిన్‌(CM Stalin) విదేశాల నుంచి తిరిగొచ్చాక తాను కూడా ఈ వ్యవహారంపై ఆయనతో చర్చించి ఢిల్లీ వెళతామని తెలిపారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో 110 ప్రకటనలు విడుదల చేశామని, వాటిని దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 8,713 జిల్లాస్థాయి ప్రభుత్వాసుపత్రులు, 2,286 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 37 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయని, వైద్యశాఖలో ఖాళీ పోస్టులను రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వాసుపత్రుల్లో 1,021 వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 980 నర్సులను నియమించే పనులు పారదర్శకంగా సాగుతున్నట్లు తెలిపారు. 2025 నాటికి క్షయ రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడమే ప్రపంచ పొగాకు నిరోధక దినం సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో కలసి ప్రతినబూనినట్లు వివరించారు.

Updated Date - 2023-06-01T09:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising