ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bridge Collapses: కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి...17 మంది కార్మికుల మృతి

ABN, First Publish Date - 2023-08-23T14:53:34+05:30

మిజోరంలోని ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 17 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు.

ఐజ్వాల్: మిజోరం (Mizoram)లోని ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జి (under construction Railway bridge) కుప్పకూలడంతో 17 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారుల బృందం, జోన్ సీనియర్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమాద సమయంలో 40 మంది కూలీలు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. కురుంగ్ నదిపై బైరాబీని సారంగ్‌తో కలిపే రైల్వే వంతన నిర్మాణంలో ఉంది.


సీఎం సంతాపం

ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో పలువురు దుర్మరణం చెందడంపై మిజోరం ముఖ్యమంత్రి జొరామ్‌థంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.


ప్రధాని దిగ్భ్రాంతి

రైల్వే బ్రిడ్జి కూలిన ఘటనలో పలువురి దుర్మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Updated Date - 2023-08-23T14:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising