ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MK Stalin: లంక నేవీ అరెస్టు చేసిన 35 మంది తమిళ జాలర్ల విడుదలకు సీఎం స్టాలిన్ లేఖ

ABN, First Publish Date - 2023-10-29T18:43:11+05:30

శ్రీలంక నావికాదళం అదుపులోనికి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు, వారి పడవలను విడిపిచేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌‌ కు ఆయన లేఖ రాశారు.

చెన్నై: శ్రీలంక నావికాదళం (Srina Lankan Navy) అదుపులోనికి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు (Fishtermen), వారి పడవలను విడిపిచేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌‌ (S.Jaishankar)కు ఆయన లేఖ రాశారు.


అక్టోబర్ 28న చేపలు పట్టేందుకు వెళ్లిన 37 మంది మత్స్యకారులు, ఐదు చేపల పడవలను శ్రీలంక నేవీ పట్టుకుందని, కేవలం చేపలు పట్టడమే జీవనాధారంగా ఈ మత్స్యకారుల కుటుంబాలు బతుకుతున్నాయని, తరచు మత్స్యకారులను అరెస్టు చేయడం వల్ల చేపలవేట జీవనాధారంగా బతుకుకున్న జాలర్ల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని స్టాలిన్ ఆ లేఖలో తెలిపారు. పాక్ జలసంధి ప్రాంతంలో భారత మత్స్యకారులకు ఉన్న సంప్రదాయ ఫిషింగ్ రైట్స్‌ను కాపాడాలని స్టాలిన్ పునరుద్ఘాటించారు. తమిళనాడు మత్స్యకారుల గోడు అరణ్యదోదనగా మిగులుతోందని అన్నారు. మత్స్యకారుల హక్కులు, వారి భద్రతకు భారత ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడాలని కోరారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకెంతమాత్రం జాప్యం చేయకుండా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రజల తరఫున మరోసారి కేంద్రాన్ని కోరుతున్నానని అన్నారు.


12 మంది తమిళ జాలర్లను అరెస్టు చేసిన మాల్దీవులు

కాగా, శ్రీలంక ప్రాదేశిక జలాల్లో ప్రవేశించారనే కారణంగా 37 మంది తమిళ జాలర్లు, ఐదు పడవలను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకున్నట్టు ఫిషరీస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. దీనికి ముందు, అక్టోబర్ 23న మాల్దీవులకు చెందిన కోస్ట్ గార్డులు 12 మంది తమిళ మత్స్యకారులను అరెస్టు చేసి, వారి పడవలను సీజ్ చేశారు. దీనిపై కూడా జైశంకర్‌కు స్టాలిన్ శనివారంనాడు ఒక లేఖ రాశారు. తమిళ జాలర్ల విడుదలకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.

Updated Date - 2023-10-29T18:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising