MLA: ఎమ్మెల్యే సంచలన ప్రకటన.. అభివృద్ధి చేయకపోతే రాజీనామా చేస్తా..
ABN, First Publish Date - 2023-06-27T08:35:00+05:30
నియోజకవర్గంలో కనీస వసతుల్లేవని, అభివృద్ధి పనులు చేపడదామంటే నిధులు రావడం లేదని ఆక్రోశం వె
ప్యారీస్(చెన్నై): మదురై దక్షిణ నియోజకవర్గంలో కనీస వసతుల్లేవని, అభివృద్ధి పనులు చేపడదామంటే నిధులు రావడం లేదని ఆక్రోశం వెలిబుచ్చిన ఎండీఎంకే ఎమ్మెల్యే భూమినాథన్(MDMK MLA Bhuminathan).. పరిస్థితి ఇలాగే ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మదురై కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం విలేకరులతో ఎమ్మెల్యే భూమినాథన్ మాట్లాడుతూ.. తనకు ఓటేసి గెలిపించిన మదురై నియోజకవర్గం ప్రజలకు కనీస వసతులు కల్పించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొరగా ప్రారంభించిన భూగర్భ డ్రైనేజీ పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తాను ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయానని, అందువల్ల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. భూమినాథన్ సాంకేతికంగా డీఎంకే ఎమ్మెల్యే అయినా, ఆయన ఎండీఎంకేకు చెందిన నేత.
Updated Date - 2023-06-27T08:35:00+05:30 IST