ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహిళలపై ఇన్ని నేరాలా?

ABN, First Publish Date - 2023-10-03T01:57:52+05:30

దేశం మొత్తం మీద మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు..

వారికి సమాన హక్కులివ్వడం విపక్షాలకు ఇష్టం లేదు

అవినీతిపరులను వదలం : ప్రధాని మోదీ

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం

జైపూర్‌/గ్వాలియర్‌, అక్టోబరు2: దేశం మొత్తం మీద మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రజాధనం లూటీ చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌ను ‘బీమారూ (వ్యాధిగ్రస్థ)’ రాష్ట్రాల జాబితా నుంచి బీజేపీ బయటపడేసిందన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో ఈ రాష్ట్రాన్ని టాప్‌ టెన్‌ రాష్ట్రా ల్లో ఒకటిగా చేశామని తెలిపారు. నవంబరు-డిసెంబరుల్లో ఎన్నికలు జరిగే ఈ రెండు రాష్ట్రాల్లో సోమవారం ఆయన పర్యటించారు. రాజస్థాన్‌లో రూ.7,200 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.19,290 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. చితోర్‌గఢ్‌, గ్వాలియర్‌లలో జరిగిన సభల్లో ప్రసంగించారు. రాజస్థాన్‌లో మహిళలపై అత్యాచారాలు ఆనవాయితీగా మారాయని ఆక్షేపించారు. మహిళలకు తాము 33 శాతం రిజర్వేషన్‌ తెచ్చామని గుర్తుచేశారు. కానీ విపక్ష ‘ఇండియా’ కూటమి నిత్యం మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తోందని..కాంగ్రెస్‌ కూటమి నేతలు దురహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలకు సమాన హక్కులు ఇవ్వడం వారికి ఇష్టం లేదని.. అందుకే కులమతాల పేరిట గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఐదేళ్లుగా సీఎం గహ్లోత్‌కు తన కుర్చీ కాపాడుకోవడానికే సరిపోతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో సగం మంది ఆయన్ను పడగొట్టడంలో బిజీగా ఉన్నారు. అవినీతి, దోపిడీలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదు. ఇది మోదీ గ్యారెంటీ. నన్ను ఎంత తిట్టినా అవినీతిపై చర్యలు కొనసాగుతాయి’ అని స్పష్టం చేశారు. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా బీజేపీ రద్దు చేయదని హామీ ఇచ్చారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతుల ఖాతాల్లో రూ.లక్షల కోట్లు జమచేశామన్నారు. ప్రతి ఒక్కరికీ నేరుగా ప్రయోజనాలు అందించడమే ‘మోదీ మోడల్‌’ అని తెలిపారు. ఇక మధ్యప్రదేశ్‌ను టాప్‌-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నది బీజేపీ లక్ష్యమని.. ప్రజలు వేసే ఒక్క ఓటు ఆ దిశగా తీసుకెళ్తుందని మోదీ తెలిపారు. కాగా ప్రధాని విమర్శలను కాంగ్రెస్‌ ఖండించింది. గాంధీజయంతి రోజు కూడా ఆయన అబద్ధాలు ఆడారని విమర్శించింది.

Updated Date - 2023-10-03T01:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising