ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rakshabandhan : ముస్లింలతో రాఖీ పండుగ.. బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపు..

ABN, First Publish Date - 2023-08-02T12:11:16+05:30

రాఖీ పండుగ సందర్భంగా ముస్లింలకు చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముస్లింల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, వారి అభివృద్ధి కోసం చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు.

Narendra Modi (File Photo)

న్యూఢిల్లీ : రాఖీ పండుగ సందర్భంగా ముస్లింలకు చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముస్లింల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, వారి అభివృద్ధి కోసం చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎన్డీయే ఎంపీలతో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేస్తూ తన ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ముస్లిం మహిళలు సంతోషిస్తున్నారని, ఈ చట్టం తమకు గట్టి భద్రతను కల్పించిందని భావిస్తున్నారని తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఒకరు మాట్లాడుతూ, ముస్లిం మహిళల మద్దతును కూడగట్టేందుకు రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మోదీ చెప్పారని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గంతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పినట్లు తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మోదీ, బీజేపీ నేతలు ఈ సమావేశంలో వివరించారన్నారు. ముస్లింలలో వెనుకబడిన వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు మోదీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.


ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లుకు 2019లో పార్లమెంటు ఆమోదం లభించింది. వెంట వెంటనే మూడుసార్లు తలాక్ అని చెప్పి, భార్యకు విడాకులివ్వడం నేరమని ఈ చట్టం చెప్తోంది. ఈ పద్ధతిలో విడాకులిచ్చే భర్తకు జైలు శిక్ష విధించవచ్చునని చెప్తోంది.

మోదీ ఇటీవల రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ, ఈ ఏడాది హజ్ యాత్రలో 4,000 మందికిపైగా ముస్లిం మహిళలు పాల్గొంటారని తెలిపారు వీరు మెహ్రం లేకుండా పాల్గొంటుండటం భారీ మార్పు అని చెప్పారు. తన ప్రభుత్వ హయాంలో హజ్ పాలసీలో మార్పులు చేశామని, హజ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోందన్నారు.

యూపీఏ ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోవడంతో, ప్రస్తుతం ప్రతిపక్ష కూటమికి ఇండియా (I.N.D.I. A) అని పేరు పెట్టారని మోదీ ఎద్దేవా చేశారు. ఈ కూటమిని ప్రజలు ఆమోదించరని చెప్పారు.

మోదీ ఎన్డీయే ఎంపీలను ప్రాంతాలవారీగా కలుస్తున్నారు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రజలతో మమేకమవాలని సలహా ఇస్తున్నారు. పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల్లో ప్రజలతో కలిసి పాల్గొనాలని చెప్తున్నారు.


ఇవి కూడా చదవండి :

Haryana and Delhi : హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో గస్తీ ముమ్మరం..

YCP Vs Congress : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం ఆగ్రహం

Updated Date - 2023-08-02T12:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising