G-20 Dinner: జి-20 సక్సెస్‌కు కృషిచేసిన ఢిల్లీ పోలీసులకు మోదీ విందు
ABN, First Publish Date - 2023-09-13T18:47:12+05:30
ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన 'జి-20' సదస్సు విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన ఢిల్లీ పోలీసు అధికారుల గౌరవార్దం ఈనెల 16న 'విందు' కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన 'జి-20' (G-20) సదస్సు విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన ఢిల్లీ పోలీసు అధికారుల గౌరవార్దం ఈనెల 16న 'విందు' కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆతిథ్యం ఇవ్వనున్నారు. జీ-20కి ఆతిథ్యమిచ్చిన ప్రగతి మైదాన్ భారత్ మండపంలో ఈ డిన్నర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. 450 మందికి పైగా ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఇందులో అతిథిలుగా పాల్గోనున్నారు. సదస్సు విజయవంతం కావడానికి కృషి చేసిన ఆయా జిల్లాలకు చెందిన ఆఫీసర్ల పేర్లు ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను అడిగినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరిగిన సదస్సుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా హస్తినను కంచుకోటగా మలచడంలో ఢిల్లీ పోలీసులు చేసిన కృషి ప్రశంసలు అందుకుంటోంది.
Updated Date - 2023-09-13T18:47:12+05:30 IST