ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dhiraj Sahu: పట్టుబడిన సొమ్ము ఎవరిదంటే..?... తొలిసారి పెదవి విప్పిన ధీరజ్ సాహు

ABN, Publish Date - Dec 16 , 2023 | 02:37 PM

పది రోజులుగా తన మద్యం డిస్టిలరీ, దాని అనుబంధ సంస్థలపై కొనసాగిన తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.351 కోట్ల నగదు కనుగొన్నట్టు ఆదాయం పన్ను అధికారులు ప్రకటించడంపై ఒడిశా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ శనివారంనాడు తొలిసారి పెదవి విప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు.

భువనేశ్వర్: పది రోజులుగా తన మద్యం డిస్టిలరీ, దాని అనుబంధ సంస్థలపై కొనసాగిన తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.351 కోట్ల నగదు కనుగొన్నట్టు ఆదాయం పన్ను (IT) అధికారులు ప్రకటించడంపై ఒడిశా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ (Dhiraj Sahu) శనివారంనాడు తొలిసారి పెదవి విప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని, వందేళ్లకు పైగా తమ కుటుంబ సభ్యులు వ్యాపారంలోనే ఉన్నారని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు. ఈ డబ్బుతో కాంగ్రెస్ పార్టీకి కానీ, మరే పార్టీకి కానీ సంబంధం లేదని స్పష్టం చేశారు.


శతాబ్దానికి పైగా మద్యం వ్యాపారంలో..

తన కుటుంబ వ్యాపారాలను మరింత వివరిస్తూ, వందేళ్లకు పైగా తన కుటుంబం మద్యం వ్యాపారంలో ఉందని, పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేయడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. లిక్కర్ వ్యాపారం అంతా నగదులోనే జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ డబ్బంతా తనది కాదని, తన కుటుంబానికిక, ఇతర కంపెనీలకు చెందినదని వివరించారు. పట్టుబడిన సొమ్ము నల్లధనమా, చట్టబద్ధమైన ధనమా అనేది ఐటీ శాఖ చెబుతుందన్నారు. ఈ వ్యాపారంలో తన ప్రత్యక్ష ప్రమేయం ఏదీ లేదని చెప్పారు. దీనికి సంబంధించిన ఏ ప్రశ్నలకైనా తన కుటుంబ సభ్యులు సమాధానం చెబుతారని అన్నారు. సాహుకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో ఈనెల 6న ప్రారంభమైన ఐటీ దాడులు శనివారంతో ముగిసాయి. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో జరిపిన ఈ దాడుల్లో రూ.351 కోట్ల నగదు, మూడు కిలోల బంగారం పట్టుబడింది.

Updated Date - Dec 16 , 2023 | 02:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising