ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narottam Mishra: అంజు-నస్రుల్లా ప్రేమకథ వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉంది: ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా

ABN, First Publish Date - 2023-07-31T18:36:00+05:30

అంజు-నస్రుల్లా ప్రేమ వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఓవైపు పాక్‌లో ఆమెను బహుమతులతో సాదరంగా స్వాగతిస్తుంటే.. ఇక్కడ భారత్‌లో మాత్రం వారి ప్రేమకథ సంచలనం రేపుతోంది. భర్త, పిల్లల్ని వదిలి అంజు పాక్‌కి వెళ్లిపోవడం..

అంజు-నస్రుల్లా ప్రేమ వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఓవైపు పాక్‌లో ఆమెను బహుమతులతో సాదరంగా స్వాగతిస్తుంటే.. ఇక్కడ భారత్‌లో మాత్రం వారి ప్రేమకథ సంచలనం రేపుతోంది. భర్త, పిల్లల్ని వదిలి అంజు పాక్‌కి వెళ్లిపోవడం.. అక్కడ ఇస్లాం మతం స్వీకరించడం.. ఆమెకు గిఫ్టులు అందుతుండటం.. వంటి అంశాలు వివాదానికి కేరాఫ్‌గా మారుతున్నాయి. ఆమె పాక్‌కి వెళ్లడం వెనుక ఏదో కుట్ర ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అంజు-నస్రుల్లా లవ్ స్టోరీపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి ప్రేమకథ వెనుక అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంజుని పాకిస్తాన్ సాదరంగా స్వాగతించడంతో పాటు ఖరీదైన బహుమతుల్ని ఇచ్చిన తీరు.. కుట్రకు తావిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై తాము దర్యాప్తుకి ఆదేశించామని, ఈ ఎపిసోడ్‌లో అంతర్జాతీయ కుట్ర ఉందా? లేదా? అనేది తేల్చి తీరుతామని పేర్కొన్నారు.


కాగా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన అంజు థామస్‌కి ఆల్రెడీ పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇవ్వకుండానే.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా కోసం పాక్‌కి వెళ్లింది. తాను జైపూర్‌కు వెళ్తున్నానని రాజస్థాన్‌లో భర్త, పిల్లలకి చెప్పి.. పాక్‌కు చెక్కేసింది. అక్కడ ఇస్లాం మతం మార్చుకొని, నస్రుల్లాని వివాహమాడింది. తొలుత తాను మతం మారలేదన్న అంజు.. ఆ తర్వాత మతం మార్చుకొని, నస్రుల్లాని పెళ్లి చేసుకుంది.

అంజు ఇలా ఇస్లాం మతాన్ని స్వీకరించడం, నస్రుల్లాని వివాహమాడటంతో.. పాక్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం, 50వేల పాకిస్తానీ రూపాయలతో పాటు కొన్ని బహుమతులు ఇచ్చారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవ్వడం వల్లే.. ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పై విధంగా అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చన్న అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. మరి.. విచారణలో ఎలాంటి నిజాలు తేలుతాయో చూడాలి.

Updated Date - 2023-07-31T18:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising